ధురంధర్ 2 టాప్ ప్లేస్ కొడుతుందా? దంగల్ ను బీట్ చేస్తుందా?

బాలీవుడ్‌ లో భారీ సంచలనం సృష్టిస్తున్న చిత్రం ధురంధర్: ది రివెంజ్. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ స్పై థ్రిల్లర్‌ లో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.;

Update: 2026-03-23 17:34 GMT

బాలీవుడ్‌ లో భారీ సంచలనం సృష్టిస్తున్న చిత్రం ధురంధర్: ది రివెంజ్. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ స్పై థ్రిల్లర్‌ లో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.750 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.

విడుదలకు ముందు నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూ ద్వారా రూ.43 కోట్లు రాబట్టిన ఆ చిత్రం, విడుదలైన తర్వాత కూడా అదే ఊపును కొనసాగించింది. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే దేశీయ మార్కెట్‌ లో రూ.115 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. హిందీ చిత్రసీమలో ఇప్పటి వరకు ఉన్న ఓపెనింగ్ వీకెండ్ రికార్డులు అధిగమించింది.

ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పఠాన్ సాధించిన ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను సునాయాసంగా దాటేసింది ధురంధర్: ది రివెంజ్ మూవీ. ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా ఆ సినిమా ప్రభంజనం సృష్టిస్తూ సుమారు రూ.180 కోట్లు వసూళ్లు నమోదు చేసింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. బాహుబలి 2: ది కన్ క్లూజన్, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాల రికార్డులు బ్రేక్ చేసింది. అదే సమయంలో ధురంధర్: ది రివెంజ్ త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశముంది.

అదే వేగం కొనసాగితే లాంగ్ రన్‌ లో రూ.2000 కోట్ల మార్క్‌ ను కూడా చేరుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో రూ.2000 కోట్ల మార్క్‌ ను అందుకున్న ఏకైక చిత్రం దంగల్ మాత్రమే. ఆ చిత్రం సుమారు రూ.2070 కోట్ల వసూళ్లతో టాప్‌ లో నిలిచింది. దాని తర్వాత బాహుబలి: ది కన్ క్లూజన్ (రూ.1788 కోట్లు), పుష్ప 2: ది రూల్ (రూ.1742 కోట్లు) తదితర చిత్రాలు నిలిచాయి. ఒకసారి ఆ లిస్ట్ ను చూద్దాం.

1.దంగల్: రూ.2070 కోట్లు

2.బాహుబలి 2: రూ.1788 కోట్లు

3.పుష్ప 2: రూ.1742 కోట్లు

4.ధురంధర్: రూ.1307 కోట్లు

5.ఆర్ఆర్ఆర్: రూ.1230 కోట్లు

6.కేజీఎఫ్ 2: రూ.1215 కోట్లు

7.జవాన్: రూ.1160 కోట్లు

8.కల్కి 2898 ఏడీ: రూ.1042 కోట్లు

9.కాంతార 1: రూ.852 కోట్లు

10.ఛావా: రూ.808 కోట్లు

ఈ నేపథ్యంలో ధురంధర్: ది రివెంజ్ మూవీ లాంగ్ రన్‌ లో ఎంత వసూళ్లు సాధిస్తుంది? దంగల్ రికార్డును బ్రేక్ చేయగలదా? అనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ప్రేక్షకుల ఆదరణ ఇదే విధంగా కొనసాగితే, ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదు కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News