స్టార్ హీరో మారాల్సిన టైమ్ వచ్చేసిందా?
టైమ్ ఎవరినైనా మార్చేస్తుంది.. ఎలాంటి వారికైనా షాక్‌లిస్తుంది. కాబట్టి టైమ్‌తో పాటు మారాల్సిందే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.;
టైమ్ ఎవరినైనా మార్చేస్తుంది.. ఎలాంటి వారికైనా షాక్‌లిస్తుంది. కాబట్టి టైమ్‌తో పాటు మారాల్సిందే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల ప్రవాహం మొదలైనా కోలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు, నిర్మాతలు మాత్రం ఆ విషయంలో సాహసం చేయలేకపోతున్నారు. భారీ బడ్జెట్‌తో శంకర్, రజనీకాంత్ మినహా ఏ డైరెక్టర్, ఏ స్టార్ పాన్ ఇండియా మూవీస్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. కారణం సినిమా బడ్జెట్‌లకు మించి హీరోల పారితోషికాలు కాగా..తమిళ, తెలుగు భాషల్లో తప్ప ఇతర భాషల్లో అవి ఆడకపోవడం.
దీంతో చాలా వరకు స్టార్ హీరోలు భారీ పాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు. భారీ నిర్మాణ సంస్థలు కూడా స్టార్లకు భారీ మొత్తాల్లో రెమ్యునరేషన్‌లు ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ మధ్య ఓ స్టార్ హీరోతో సినిమా అంటే భారీ కంపనీలు సైతం పారితోషికం కారణంగా పారిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో మరెవరో కాదు అజిత్. అదేంటీ దళపతి విజయ్ స్థాయిలో ఆయనకు క్రేజ్ ఉందికదా? ఆయన రెమ్యునరేషన్ గురించి విని పారిపోవడం ఏంటీ? అని సందేహం రావచ్చు.
అయితే ఆయన ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.200 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. ఇటీవల వరుస ఫ్లాపులతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తెలుగు మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ వారు అజిత్‌తో `గుడ్ బ్యాడ్ అగ్లీ` మూవీ చేశారు. బడ్జెట్ రూ.270 కోట్లు పెడితే వచ్చింది రూ.180 కోట్లు మాత్రమే. అంటే దాదాపుగా రూ.90 కోట్లకు పైనే నష్టాపోయారన్నమాట. ఈ మూవీ టైమ్‌లో మరో సినిమా చేయాలనుకున్నా `గుడ్ బ్యాడ్ అగ్లీ` అనుభవంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట.
ఈ నేపథ్యంలో అజిత్‌తో సినిమా అంటే ఎవరూ ముందుకు రావడం లేదని, తనతో మూవీ అంటే కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ పారిపోతున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఫ్లాప్‌లు, డిజాస్టర్లు వచ్చినప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు రెగ్యులర్‌గా తీసుకునే పారితోషికాన్ని డిమాండ్ చేకుండా ఎంత ఇస్తే అంత తీసుకుని చేసిన సందర్భాలున్నాయి. రవితేజనే తీసుకుంటే `భర్త మహాశయులకు విజ్ఞప్తి` సినిమాకు పారితోషికాన్ని తగ్గించి తీసుకుని సినిమా చేశారనే వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం అజిత్ కూడా ఇదే దారిలో పారితోషికం తగ్గించుకోవడమో లేక సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకుంటాననో చెబితే ప్రొడ్యూసర్స్ కూడా తనతో సినిమా చేయడానికి ఆలోచిస్తారు. ముందుకొస్తారు. అలా మారకుండా రూ.200 కోట్లు ఇవ్వాల్సిందే అంటే ఇప్పట్లో ఏ నిర్మాత తనతో మూవీ చేసే సాహసం చేయరనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. మరి పరిస్థితులకు తగ్గట్టు అజిత్ పారితోషికం విషయంలో మెట్టు దిగుతారా? ..లేక తగ్గేదేలే అన్నట్టుగా వ్యహరిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.