బాక్సాఫీస్‌కు షాక్ ఇవ్వబోయే హారర్ సినిమాలు… టాప్ 5 లిస్ట్!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ట్రెండ్స్ వచ్చినా, మారినా హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ అస్సలు తగ్గదు. థియేటర్లలో భయపడుతూ, ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు.

Update: 2026-07-05 08:32 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ట్రెండ్స్ వచ్చినా, మారినా హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ అస్సలు తగ్గదు. థియేటర్లలో భయపడుతూ, ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. అందుకే 2026 సెకండ్ హాఫ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ఐదు భారీ హారర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. పాత సూపర్ హిట్ సిరీస్‌ల నుంచి సరికొత్త కథల వరకు.. హారర్ లవర్స్‌కు ఫుల్ వినోదాన్ని పంచేందుకు వస్తున్న ఆ టాప్ 5 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఈవిల్ డెడ్ బర్న్ :

హారర్ సినిమాలను ఇష్టపడే వారికి 'ఈవిల్ డెడ్' సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీనే 'ఈవిల్ డెడ్ బర్న్'. సెబాస్టియన్ వానిసెక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఒరిజినల్ మేకర్ శామ్ రైమి నిర్మిస్తున్నారు. ఇక ఈ సిరీస్ మొత్తంలోనే ఇది అత్యంత భయంకరంగా ఉండబోతోందని టాక్. జూలై 10నే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్:

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన 'ఇన్సిడియస్' సిరీస్ నుంచి వస్తున్న మరో సూపర్ నాచురల్ హారర్ ఫిల్మ్ ఇది. ఒక యువ తల్లికి 'ది ఫర్దర్' అనే ఆత్మల ప్రపంచంలోకి వెళ్లే వింత శక్తి ఉంటుంది. అయితే, ఆమెకు ఉన్న ఈ శక్తే నరకంలోని భయంకరమైన దెయ్యాలు, శక్తులు నిజ ప్రపంచంలోకి రావడానికి కారణమవుతుంది. ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమా కథ.

సెప్టెంబర్‌లో ‘రెసిడెంట్ ఎవిల్ ’ :

ఇది కొత్త వెర్షన్ రిలీజ్ కానుంది. ఈ మూవీలో యాక్షన్ తగ్గించి, హారర్ ఫీల్‌ను పెంచేలా రూపొందించారు జాక్ క్రెగ్ర్ . ఇక మెడికల్ కొరియర్‌గా పనిచేసే ఒక యువకుడు, ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే భీకరమైన పోరాటమే ఇందులో చూపించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

క్లేఫేస్:

జేమ్స్ గన్ నేతృత్వంలోని డిసి యూనివర్స్ నుంచి వస్తున్న విభిన్నమైన హారర్ మూవీ ఇది. కామిక్ బుక్ కథకు హారర్ ఎలిమెంట్స్ జోడించి దీనిని తెరకెక్కిస్తున్నారు. అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే ఒక నటుడు, తన పాపులారిటీని కాపాడుకోవడానికి ఒక ప్రయోగాత్మక కెమికల్ వాడుతాడు. ఇక దాని వల్ల అతనికి ఎదురైన భయంకరమైన పరిణామాలు ఏంటనేదే మైక్ ఫ్లానగన్ రాసిన ఈ కథ.

వెర్‌వుల్ఫ్:

విజువల్ గా మైండ్ బ్లోయింగ్ హారర్ సినిమాలు తీసే ఫేమస్ డైరెక్టర్ రాబర్ట్ ఎగ్గర్స్ నుంచి వస్తున్న సినిమా 'వెర్‌వుల్ఫ్'13వ శతాబ్దపు ఇంగ్లాండ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది తోడేలు పురాణాల ఆధారంగా చాలా డార్క్ అండ్ అట్మాస్ఫియరిక్ లుక్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఇక సినిమా చూస్తున్నంత సేపు ఒక కొత్త లోకంలో ఉన్న ఫీలింగ్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో సినిమాలు, యాక్షన్ సినిమాలు కాస్త నెమ్మదించినా.. హారర్ జోనర్ మాత్రం ఎప్పుడూ సేఫ్ బెట్ అని నిరూపిస్తూనే ఉంది. ఇక 2026 సెకండ్ హాఫ్ లో రాబోతున్న ఈ ఐదు సినిమాలు హారర్ లవర్స్‌కు థియేటర్లలో ఖచ్చితంగా సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో, గుండె గట్టిగా చేసుకుని థియేటర్లకు వెళ్లడానికి రెడీ అయిపోండి..

Tags:    

Similar News