బోయ్‌ఫ్రెండ్‌తో పబ్లిగ్గానే మొదలుపెట్టిన బ్యూటీ
`ఆదిపురుష్` చిత్రంలో సీతగా నటించిన కృతి సనన్ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ విజయాల్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే.
`ఆదిపురుష్` చిత్రంలో సీతగా నటించిన కృతి సనన్ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ విజయాల్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే `కాక్ టైల్ 2` చిత్రంలో షాహిద్ తో ఘాటైన రొమాన్స్ చేసింది. అయితే ఈ బ్యూటీ నిజ జీవితంలోను రొమాన్స్ ని ఆస్వాధిస్తోందనే కథనాలు వస్తున్నాయి. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక క్రేజీ రూమర్‌తో కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బాహియాతో కృతి సనన్ డేటింగ్‌లో ఉందంటూ కొన్ని నెలలుగా బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఇన్నాళ్లూ తన లవ్ లైఫ్ లో దాగుడుమూతలు ఆడిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పుడు ఏకంగా తన బోయ్‌ఫ్రెండ్‌తో పబ్లిగ్గానే షికార్లు చేస్తూ కెమెరాల కంటికి చిక్కింది.
ఈ వారం రోజుల్లోనే కృతి సనన్ తన లండన్ బిజినెస్ మేన్ కం బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబై వీధుల్లో రెండు సార్లు పబ్లిక్‌గా కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన ఇన్‌స్టా రీల్స్, ఇతర వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్ అయిపోవడంతో వీరిద్దరి బంధం త్వరలోనే పెళ్లి పీటల వరకు వెళ్లనుందా అనే చర్చ హిందీ మీడియాలో సాగుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే... ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కృతి సనన్ నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా `కాక్ టెయిల్ 2` బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేక కేవలం యావరేజ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది. అయినా ఈ చిత్రంలో కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కృతి సనన్ చేతిలో ప్రస్తుతం కొన్ని భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.
ప్రస్తుతం 2026-27 లైనప్‌లో కృతి సనన్ మరికొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉంది. అందులో మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ సీక్వెల్ `నో ఎంట్రీ` సీక్వెల్ లో నటిస్తోందని గుసగుసలు వినిపించినా దీనిని ఇంకా నిర్మాత బోనీకపూర్ ధృవీకరించలేదు. దీనితో పాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక పవర్‌ఫుల్ ఉమెన్-ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ కి కూడా కృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు 2026 చివరికల్లా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవే కాకుండా.. కృతి సనన్ తన సొంత నిర్మాణ సంస్థ `బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్` బ్యానర్‌పై కూడా కొన్ని విభిన్నమైన కథలను వెబ్ సిరీస్ - ఓటీటీ సినిమాల రూపంలో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. అటు పర్సనల్ లైఫ్‌లో బోయ్‌ఫ్రెండ్‌తో షికార్లు.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో క్రేజీ ప్రాజెక్టులతో కృతి సనన్ ప్రస్తుతం అటు ఇటు బిజీబిజీగా గడుపుతోందని చెప్పవచ్చు.