గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్‌ ఈ టాలీవుడ్ దర్శకుడితో?

ఇదే రేసులోకి ఇప్పుడు బాలీవుడ్ `గ్రీక్ గాడ్` హృతిక్ రోషన్ కూడా చేరిపోయాడనే ప్రచారం బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Update: 2026-07-05 06:03 GMT

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్, కోలీవుడ్ వంటి సౌత్ దర్శకులకే పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే షారూఖ్ ఖాన్ -అట్లీతో `జవాన్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో ప‌ని చేసాడు. మురుగదాస్‌తో సికందర్ సినిమా చేసాడు స‌ల్మాన్. షాహిద్ కపూర్ కి సందీప్ రెడ్డి వంగా క‌బీర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాని అందించాడు. అక్షయ్ కుమార్ కూడా టాప్ సౌత్ దర్శకులతో క‌లిసి ప‌ని చేస్తున్నాడు. ప్రియ‌ద‌ర్శ‌న్ తో ఏకంగా 7 సినిమాలు చేసిన ఘ‌న‌త అక్ష‌య్ సొంతం. రణ్‌వీర్ సింగ్ సైతం దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే రేసులోకి ఇప్పుడు బాలీవుడ్ `గ్రీక్ గాడ్` హృతిక్ రోషన్ కూడా చేరిపోయాడనే ప్రచారం బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కేజీఎఫ్, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ `హోంబాలే ఫిల్మ్స్` బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో ఒక భారీ చిత్రాన్ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినా దీనికి దర్శకత్వం వహించబోయే దర్శకుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం మేకర్స్ అప్పట్లో వెల్లడించలేదు. అప్పటి నుండి ఈ భారీ సినిమాను హ్యాండిల్ చేయబోయే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ రూమర్ దావానలంలా వ్యాపించింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, `యానిమ‌ల్‌` ఫేమ్ పరశురామ్ (బుజ్జి) ఈ హోంబాలే-హృతిక్ రోషన్ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో ప్ర‌చార‌మైపోతోంది. నిజానికి ఈ వార్త వినగానే ఒక్కసారిగా అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. పరశురామ్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో హృతిక్ రోషన్ టచ్‌లోకి వెళ్ళాడని.. కథా చర్చలు కూడా జరిగాయని పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి.

అయితే ఈ వైరల్ వార్తలపై చిత్ర పరిశ్రమకు చెందిన స‌న్నిహిత‌ వర్గాలు, మేకర్స్ స్పందించారు. హృతిక్ రోషన్, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ పూర్తిగా బేస్‌లెస్ పుకార్లు అని కొట్టిపారేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా అధికారికంగా సైన్ చేయలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ క్రేజీ కాంబో వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.

ఇక హృతిక్ రోషన్ కెరీర్ విషయానికి వస్తే..అత‌డు వరుసగా స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో మెరుస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన అలియా భట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ `ఆల్ఫా` చిత్రంలో హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించి మెప్పించారు. అంతేకాకుండా.. త్వరలోనే రిలీజ్ కి వ‌స్తున్న‌ మోస్ట్ అవైటెడ్ కోలీవుడ్ ప్రాజెక్ట్ `జైలర్ 2` లో కూడా హృతిక్ మరో అతిథి పాత్రలో అలరించబోతున్నారు. ఏదేమైనా సౌత్ డైరెక్టర్లతో బాలీవుడ్ హీరోల లైనప్ చూస్తుంటే పాన్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News