డిజైనర్ డ్రెస్‌లో త్రిషా మ్యాజిక్… ఎథ్నిక్ ఫ్యాషన్‌కు కొత్త డెఫినిషన్!
పసుపు రంగు డిజైనర్ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతూ.. సాంప్రదాయ ఫ్యాషన్‌కు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది ఈ చెన్నై సొగసరి.ఆ వివరాలు చూద్దాం..
టాలీవుడ్, కోలీవుడ్‌లలో రెండు దశాబ్దాలుగా తన అందం, నటనతో అలరిస్తున్న ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష.. తాజాగా మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ కట్టిపడేసింది. గోవాలో జరిగిన ఒక పెళ్లి వేడుక కోసం ఆమె ధరించిన సాంప్రదాయ దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పసుపు రంగు డిజైనర్ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతూ.. సాంప్రదాయ ఫ్యాషన్‌కు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది ఈ చెన్నై సొగసరి.ఆ వివరాలు చూద్దాం..
పసుపు అవుట్‌ఫిట్‌లో త్రిష అట్రాక్ట్ చేసింది… ఈ ఈవెంట్ కోసం గుప్త రూపొందించిన స్టైలిష్ యెల్లో డ్రెస్‌ను ధరించింది. స్లీవ్‌లెస్ టాప్‌పై మల్టీ కలర్ త్రెడ్‌తో చేసిన హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ డ్రెస్‌కు రాయల్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇక దానికి మ్యాచింగ్‌గా సాఫ్ట్ బాటమ్, చేతులపై స్టైలిష్‌గా వేసుకున్న నెట్టెడ్ దుపట్టాతో త్రిష ఎంతో హుందాగా కనిపించింది.
లుక్‌ను మార్చేసిన స్పెషల్ జ్యువెలరీ:
కేవలం డ్రెస్ మాత్రమే కాదు.. దానికి జోడించిన నగలు కూడా త్రిష లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. 'వసుంధర జ్యువెలరీ' నుంచి తీసుకున్న భారీ ఇయర్‌రింగ్స్, 'ఎమ్‌ఎస్ పింక్ పాంథర్ జ్యువెల్' బ్రాండ్‌కు చెందిన ట్రెడిషనల్ గాజులు ఆమె చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇక ప్రముఖ స్టైలిస్ట్‌లు ఏకా లఖానీ, హర్షిణి రవిచందర్ టీమ్ ఈ లుక్‌ను పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు.
రెండు దశాబ్దాల ఎవర్ గ్రీన్ క్రేజ్:
1999లో 'జోడి' సినిమాతో సైడ్ క్యారెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష.. 'మౌనమ్ పేసియాదే' చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సామి, గిల్లి వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో '96', 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' చిత్రాలతో తన నటనలోని విశ్వరూపాన్ని చూపించింది.
వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ:
ఈ వయసులోనూ త్రిష క్రేజ్ అస్సలు తగ్గలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అజిత్ సరసన విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో పాటు కమల్ హాసన్‌తో థగ్ లైఫ్, సూర్య సరసన 'కరుప్పు' వంటి భారీ సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది..ఇక రాబోయే చిరంజీవి మూవీ విశ్వంభర లో నటిస్తుంది..
ప్రకృతి అందాల నడుమ ఎషాన్ రాజు, ఖుష్బూ గుప్తా తీసిన ఫోటోలలో త్రిష లుక్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇక ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను పరిచయం చేస్తూ, కాలంతో పాటు మరింత అందంగా మారుతున్న త్రిష.. నిజంగానే ఎథ్నిక్ ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.