మెగాస్టార్ బర్త్ డేకి డబుల్ ధమాకా!
ప్రతి ఏటా ఆగస్టు 22న మెగా అభిమానులు తమ అభిమాన హీరో నుంచి కొత్త అప్‌డేట్స్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటేనే పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఏటా ఆగస్టు 22న మెగా అభిమానులు తమ అభిమాన హీరో నుంచి కొత్త అప్‌డేట్స్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కూడా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య నటిస్తోన్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి డబుల్ ధమాకా అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` - బాబి కొల్లి దర్శకత్వంలో చేస్తున్న `మెగా 158` ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
అందులోనూ `విశ్వంభర` చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా సోషియో ఫాంటసీ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసినిమా నుంచి ట్రైలర్ లాంటి మేజర్ అప్‌డేట్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే అవకా శం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన మెగా ఈవెంట్‌ను తలపించనుంది. అలాగే బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `మెగా 158` గురించి కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి కూడా పవర్‌ఫుల్ గ్లింప్స్ ..ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. `వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇద్దరి కలయికలో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్‌తో పాటుగా, చిరంజీవి తదుపరి చిత్రాలకు సంబంధించి ఏవైనా ? సంకేతాలు ఇస్తారేమోనని కూడా అభిమానులు ఆశీ స్తున్నారు. ముఖ్యంగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరంజీవి చేయబోయే ప్రాజెక్ట్ గురించి కూడా ఏదైనా? చిన్న ప్రకటన వస్తే అది అభిమానులకు డబుల్ బొనాంజా అవుతుంది.
పుట్టినరోజు సందర్భంగా సినిమాల అప్‌డేట్స్ ఇవ్వడం చిరంజీవికి ఎప్పుడూ అలవాటే. కానీ ఈసారి అది ఒక రేంజ్‌లో ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల అప్‌డేట్స్ అభిమానులకే కాకుండా ట్రేడ్ వర్గాలకు కూడా ఎంతో కీలకం. భారీ బడ్జెట్ .. అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించ బోతున్నాయో? తెలియాలంటే అప్‌డేట్స్ ఎంతో కీలకం కానున్నాయి. సినిమా పురోగతిని, విడుదల తేదీల ఖరారును పరోక్షంగా ఈ అప్‌డేట్స్ ద్వారా స్పష్టం చేసే అవకాశం ఉంది.
మొత్తంగా ఆగస్టు 22 టాలీవుడ్ లో కోలాహాలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోజు భారీ ఎత్తున అభిమానులు ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ రకమైన ఈవెంట్లు ఎన్నో జరుగుతాయి. వాటిని ఉద్దేశించి అన్నయ్య చేసే వ్యాఖ్యలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి.