సంగీతానికి బ్రేక్ ఇవ్వనున్న దేవి శ్రీ ప్రసాద్?

టాలీవుడ్ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకోబోతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా తనదైన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్న రాక్ స్టార్ దృష్టిని పూర్తిగా నటన వైపు మళ్లించాలని భావిస్తున్నారట.

Update: 2026-07-05 05:26 GMT

టాలీవుడ్ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకోబోతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా తనదైన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్న రాక్ స్టార్ దృష్టిని పూర్తిగా నటన వైపు మళ్లించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన సంగీత బాధ్యతల నుండి కొంతకాలం తాత్కాలికంగా విరామం తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ `ఎల్లమ్మ` అనే చిత్రంతో కథానాయకుడిగా వెండితెరపై పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా కోసం దేవి శ్రీ చాలా శ్రద్ధ వహిస్తున్నారని, నటనలో మెళకువలు నేర్చుకోవడంతో పాటు తన పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది.

నటుడిగా నిలదొక్కుకోవాలంటే సంగీత దర్శకత్వం నుండి విరామం అవసరమని పూర్తి స్థాయిలో స్క్రిప్టులు చదవడం ..పాత్రల కోసం సమయం కేటాయించడంపైనే ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే దేవి శ్రీ ప్ర‌సాద్ కు అత్యంత సన్నిహితమైన దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రం RC17 విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన బలంగా ఉంటుంది. అయితే దేవిశ్రీ నటన వైపు మొగ్గు చూపుతున్న నేప‌థ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్ కోసం కొత్త సంగీత దర్శకులను సుకుమార్ పరిశీలిస్తున్నారని స‌మాచారం.దేవిశ్రీ ప్రసాద్ అందుబాటులో ఉండటం కష్టమని భావించి మాష్టారు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారట.

సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న కళాకారుడు నటుడిగా మారడానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకవేళ దేవి శ్రీ నిజంగానే సంగీతానికి బ్రేక్ ఇస్తే టాలీవుడ్‌లో స్థ‌బ్ద‌త‌ ఏర్పడుతుందనేది వాస్తవం. తెలుగు సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ ఎలాంటి సంగీతాన్ని అందించారు? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌త్యేకించి సుకుమార్ సినిమా దానికి డీఎస్పీ మాత్ర‌మే సంగీతం అందించాలి అనే ముద్ర ప‌డిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ సుకుమార్ తెర‌కెక్కించిన ప్ర‌తీ సినిమాకు ఆయ‌నే సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. `ఆర్య` నుంచి `పుష్ప` ఎలాంటి మ్యాజిక్ చేసారో విధిత‌మ‌మే. ఆ స్థాయి మ్యాజిక్‌ను మరో దర్శకుడు తీసుకురాగలరా అనేది పెద్ద ప్రశ్న.

అయితే సినీ వర్గాల్లో ఈ వార్తలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటుడిగా సక్సెస్ అవ్వడం అనేది ఒక ఎత్తు అయితే? దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును వదులుకోవడం సాధ్యమేనా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బహుశా దే విశ్రీ పూర్తిస్థాయిలో కాకుండా ఎంపిక చేసుకున్న చిత్రాలకు మాత్రమే సంగీతం అందిస్తూ నటనను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు.

ఏది ఏమైనా? దేవిశ్రీ ప్రసాద్ నటనపై చూపిస్తున్న ఆసక్తి తెలుగు సినిమా రంగానికి కొత్త సవాల్‌గా మారింది. సుకుమార్ వంటి దర్శకుడు కూడా తన ప్రాజెక్టుల కోసం కొత్త సంగీత దర్శకులను వెతుకుతున్నారంటే? ఈ మార్పు ఎంతటి తీవ్రతతో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News