ఓర్రీ వేషాలు.. హస్తర్‌ను కూడా వదల్లేదుగా!

బాలీవుడ్‌లో సినిమా చేయకుండానే తరచూ వార్తల్లో ఉండే సెలబ్రిటీల్లో ఓర్రీ ఒకడు. అసలు పేరు ఓర్హాన్ అవత్రమణి అయినా, అందరికీ ఓరీగానే పరిచయం.

Update: 2026-10-30 04:00 GMT

బాలీవుడ్‌లో సినిమా చేయకుండానే తరచూ వార్తల్లో ఉండే సెలబ్రిటీల్లో ఓర్రీ ఒకడు. అసలు పేరు ఓర్హాన్ అవత్రమణి అయినా, అందరికీ ఓర్రీ గానే పరిచయం. స్టార్ హీరోయిన్లతో పార్టీ ఫొటోలు, విచిత్రమైన డ్రెస్సులు, కెమెరాల ముందు సరదా చేష్టలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ కార్యక్రమానికి వెళ్లినా తనవైపు కెమెరాలు తిరిగేలా చూసుకుంటాడు. ఇప్పుడు హాలోవీన్ కోసం కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు.

ఈసారి మాత్రం ఖరీదైన ఫ్యాషన్ డ్రెస్ కాకుండా ఓ హారర్ సినిమా పాత్రను ఎంచుకోవడం హైలెట్. 'తుంబాడ్'లో భయపెట్టిన హస్తర్ రూపంలో ఓర్రీ ముంబైలో కనిపించాడు. ఒంటినిండా ఎర్రటి రంగు, కళ్ల చుట్టూ నల్లటి మేకప్, తలపై బంగారు కిరీటం పెట్టుకున్నాడు. నడుముకు పాతకాలపు వస్త్రం చుట్టుకుని, కాళ్లకు కూడా రంగు వేసుకున్నాడు. చేతిలో ఓ చిన్న బొమ్మ పట్టుకుని కెమెరాల ముందు చేతులు జోడిస్తూ, నవ్వుతూ పోజులిచ్చాడు.

సినిమాలో ఆ పాత్ర భయపెడితే, ఓర్రీ గెటప్‌లో మాత్రం కొంచెం కామెడీ కూడా కనిపించింది. వీడియో బయటకు రాగానే నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్లు మొదలుపెట్టారు. 'స్వీట్ హస్తర్' అంటూ ఒకరు సరదాగా స్పందించారు. కొందరు గెటప్ కోసం అతడు పెట్టిన శ్రమను మెచ్చుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీల పక్కన ఫొటోలు దిగే ఓర్రీ, ఈసారి ఒంటరిగానే సోషల్ మీడియాలో కావాల్సినంత హడావుడి చేశాడు.

హాలోవీన్‌కు హాలీవుడ్ హారర్ పాత్రలు, జాంబీ గెటప్స్ ఎంచుకోవడం కామన్. కానీ ఓర్రీ భారతీయ జానపద హారర్ సినిమా నుంచి హస్తర్‌ను తీసుకున్నాడు. 'తుంబాడ్' చూసినవాళ్లకు ఆ వేషం వెంటనే గుర్తుపట్టేలా ఉంది. సినిమా విడుదలై ఎనిమిదేళ్లయినా ఆ పాత్రను ఓర్రీ తన స్టైల్‌లో మార్చుకోవడం ఆసక్తికరం. మేకప్‌తో పాటు అతడు ఇచ్చిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ వీడియోను మరింత సరదాగా మార్చాయి.

నిజానికి ఈ హాలోవీన్ సీజన్‌లో ఓరీ ఒక్క గెటప్‌తో సరిపెట్టుకోలేదు. కొన్ని రోజుల క్రితం ముఖానికి నీలిరంగు మేకప్ వేసుకుని మెక్సికన్ 'డే ఆఫ్ ది డెడ్' తరహా లుక్‌లో ఫొటోలు పెట్టాడు. ఆ ఫొటోల్లో రుహానికా ధావన్ కూడా కనిపించారు. మరో వీడియోలో 'కభీ ఖుషీ కభీ గమ్'లో కరీనా కపూర్ పోషించిన పూ పాత్రలా రెడీ అయ్యాడు. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను ఎంచుకుంటూ తన ఫాలోవర్లను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

Tags:    

Similar News