పిక్‌టాక్ : చక్కనమ్మ చిక్కిందా ఏంటి?
స్కిన్ షో చేయకున్నా మృణాల్ ఇలాంటి ఫోటో షూట్స్ తో కూడా చూపు తిప్పనివ్వదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ ప్రమోటింగ్ ఫోటో షూట్ అని తెలుస్తోంది.
బుల్లి తెర ద్వారా వెండి తెరపై అడుగు పెట్టి సుదీర్ఘ కాలంగా రంగుల ప్రపంచంలో వినోదాన్ని అందిస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటింది. హిందీ సీరియల్స్, హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తూ వచ్చిన ముద్దుగుమ్మకు లక్కీగా తెలుగు సినిమా 'సీతారామం' సినిమాతో హిట్ పడింది. ఆ సినిమాలో చిన్న పాత్ర కోసం మృణాల్‌ను దర్శకుడు హను రాఘవపూడి కలవడం జరిగిందని, కానీ ఆమెను చూసిన తర్వాత సీతా మహాలక్ష్మి పాత్రకు మృణాల్ అయితేనే బాగుంటుందనే నమ్మకంతో ఆమెను నటింపజేశాడు. ఆయన నమ్మకంను మృణాల్ నిలుపుకుంది, అంతే కాకుండా సీతా మహాలక్ష్మి పాత్ర గురించి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు చెప్పుకునే విధంగా నటించి, అందంగా కనిపించి మెప్పించింది. అందుకే సీతారామం సినిమా మృణాల్ కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ అనడంలో సందేహం లేదు.
టాలీవుడ్లో మృణాల్ ఠాకూర్‌కి...
హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌కి టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఈమెకు బాలీవుడ్లో స్టార్డం దక్కించుకోవడం ఆసక్తి. అందుకే టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ కూడా బాలీవుడ్లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. తెలుగులో డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడికి మంచి హిట్ పడింది. అయితే తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి మాత్రం ఈ అమ్మడు ఆసక్తి చూపడం లేదు అనేది కంప్లైంట్. బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలు చేస్తూనే ఉంది. సౌత్ లో వస్తున్న ఆఫర్లను ఈమె సున్నితంగా తిరస్కరిస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. సౌత్ లో రాకా తర్వాత ఇప్పటి వరకు ఈమె కొత్త సినిమాను కమిట్ కాలేదు.
రాకా సినిమాలో మృణాల్...
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతున్న రాకా సినిమాలో ఈమె నటిస్తుందా అనే విషయంలో కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కొత్త సినిమాలు ఏమీ చేయక పోయినా ఎప్పటికప్పుడు అందమైన ఫోటోలు, వీడియోలతో మృణాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి అందాల ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 16 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా స్కిన్ షో ఫోటోలు, అప్పుడప్పుడు ఇలాంటి అందమైన ఔట్ ఫిట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. స్కిన్ షో ఫోటోలు షేర్ చేస్తే వైరల్ కావడం పెద్ద వింతేమి కాదు, కానీ ఇలా నిండుగా ఉన్న ఫోటోలను షేర్ చేసిన సమయంలో కూడా వైరల్ అయితే అప్పుడు వారి బ్యూటీకి ఒక విలువ ఉన్నట్టు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఫోటో షూట్...
స్కిన్ షో చేయకున్నా మృణాల్ ఇలాంటి ఫోటో షూట్స్ తో కూడా చూపు తిప్పనివ్వదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ ప్రమోటింగ్ ఫోటో షూట్ అని తెలుస్తోంది. బెంగళూరు డైరీస్ అంటూ ఈ ఫోటోలకు ఇన్స్టాగ్రామ్ లో మృణాల్ కామెంట్ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ ఫోటోల్లో మృణాల్ ఠాకూర్ ను చూస్తూ ఉంటే కాస్త బరువు తగ్గినట్టు అనిపిస్తుందని, తన గత చిత్రాలతో పోల్చితే ఈ ఫోటోల్లో సన్నగా, చిక్కిందా అన్నట్లుగా కనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. మృణాల్ కెరీర్ ఆరంభంలో కాస్త ఎక్కువ బరువు కలిగి ఉండేది. అయినా కూడా చాలా అందంగా ఉండేది. అయితే కొందరు సన్నబడితే అందం తగ్గుతుందని అంటారు. కానీ మృణాల్ విషయంలో అది నిజం కాదని ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా ఈ ఫోటోలకు మృణాల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు తెలుగు అభిమానులు తెలుగులో సినిమా ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మృణాల్ సమాధానం ఏంటో మరి...!