బ్లాక్ బ‌స్ట‌ర్ కు మీ అవ‌స‌రం లేదు.. ఫ్లాప్ కే మీరు కావాలన్న పూరి

Update: 2020-10-10 04:45 GMT
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గ‌త కొన్ని రోజులుగా పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆడియో సందేశాల‌ని విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఫ్లాప్ మూవీస్ పై త‌న థియేరీని వినిపించారు. ఫ్లాప్ మూవీస్ .. ఫ్లాప్ ని ఎవ్వ‌రూ కోరుకోరు. ఫ్లాప్ అవుతుంద‌ని తెలిస్తే ఎవ‌రూ సినిమా తీయ‌రు. ఏడాదిలో రెండువంద‌ల సినిమాలొస్తే.. హిట్ ‌లు.. బ్లాక్ బ‌స్ట‌ర్ లు క‌లిపి ప‌దే వుంటాయి. మిగిలిన నూట తొంబై ఫ్లాపులే. జీవితాంతం ఈ ఫ్లాపులు చూడ‌లేక వాటిని ఎన‌లైజ్ చేయ‌లేక జ‌ర్న‌లిస్టుల‌కి తిక్క‌లేసి రివ్యూల‌తో వాయించి ప‌డేస్తారు. ఎందుకంటే అన్ని సినిమాలు అలాగే ఏడుస్తున్నాయ్‌.

ఆ రివ్యూల దెబ్బ‌కి అప్ప‌టికే అన్నీ అమ్ముకున్న ప్రొడ్యూస‌ర్ ఇండ‌స్ట్రీ వ‌దిలేసి పోతాడు. అత‌డి ప్లేస్ లో ఇంకొక‌డు వ‌స్తాడు. ఇంకో ఫ్లాప్ సినిమా తీస్తాడు. నిజం ఏమిటంటే ఆ నూటా తొంబై ఫ్లాపుల‌మీదే ఇండ‌స్ట్రీ బ‌తుకుతుంది. ఇక్క‌డ అన్నంపెట్టేవి అవే. ఫ్లాప్ సినిమా వ‌ల్ల కూడా దేశానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఒక ఫ్లాప్ సినిమా కోసం ప్రొడ్యూస‌ర్ కోట్లు ఖ‌ర్చు పెడితే .. యాక్ట‌ర్లు..జూనియ‌ర్ ఆర్టిస్ట్‌లు.. సెట్ లు..అవుట్ డోర్‌ యూనిట్.. లొకేష‌న్ ల కోసం ఇలా ఎంతో మందికి ప‌నిస్తాడు. అంద‌రూ రెమ్యున‌రేష‌న్ లు తీసుకుంటారు. గ‌వ‌ర్న‌మెంట్ కు ట్యాక్స్ లు క‌డ‌తారు. అంద‌రికీ క‌వ‌ర్లు ఇస్తాడు. హోర్డింగ్ ల‌కి.., పేప‌ర్ యాడ్స్ ‌కి...., వెబ్ సైట్స్ కి,... హోట‌ల్స్ ‌కి.., ట్రైన్ల‌కి..., ఫ్లైట్స్ కి ఇలా అంద‌రికి డ‌బ్బు క‌ట్టే వుంటాడు. అంద‌రం బెనిఫిట్స్ పొందుతాం. కానీ సినిమా తేడా వ‌స్తే వాడి తాట‌తీస్తాం. మ‌న రాత‌ల‌తో,... ట్వీట్స్ ‌తో మ‌ళ్లీ ఆ ప్రొడ్యూస‌ర్ కి ఎవ‌రూ డేట్స్ ఇవ్వ‌కుండా ..ఆ ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి ఇంకో సినిమా రాకుండా చేస్తాం..

సినిమా రివ్యూస్ రాసే అంద‌రికి చేతులెత్తి మొక్కుతూ అడుగుతున్నా.. మీరు కాపాడాల్సింది ఫ్లాప్ మూవీస్ ని. బ్లాక్ బ‌స్ట‌ర్స్ ‌ని కాదు. ఐ నో ఆల్ యువ‌ర్ ఫ్ర‌స్ట్రేటెడ్ బ్యాడ్ మూవీస్‌.  ఇక్క‌డ ఎవ‌రూ జీనియ‌స్ కాదు. తెలిసో తెలియ‌కో డైరెక్ట‌ర్ ఫ్లాప్ తీసివుండ‌వ‌చ్చు. కానీ వాడివ‌ల్ల కొంత మందికి తిండి దొరుకుతుంది. వాడు బుర్ర త‌క్కువ వాడు కావ‌చ్చు. వాడిని ఆ ప్రొడ్యూస‌ర్ ‌ని కాపాడ‌వ‌ల‌సిన బాధ్య‌త మ‌న‌మీద వుంది. మీకు రేటింగ్ ఒక‌టి ఇవ్వాల‌నిపిస్తే రెండు ఇవ్వండి. రెండు ఇవ్వాల‌నిపిస్తే మూడు ఇవ్వండి. ఒక్క స్థానం పెర‌గ‌డం వ‌ల్ల షాటిలైట్ అమ్ముడ‌వుతుంది. దాని వ‌ల్ల కొన్ని కుటుంబాలు బ్ర‌తుకుతాయి` అని ఫ్లాప్ సినిమాల థియేరీని చెప్పారు పూరి.
Full View
Tags:    

Similar News