• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరి.. ఆ సినిమాను...

పూరి.. ఆ సినిమాను అవగొట్టేశాడా?

By - Tupaki Desk
Update: 2016-05-26 19:30 GMT
టాలీవుడ్లో అత్యంత వేగంగా సినిమాల్ని అవ్వగొట్టే దర్శకుల్లో పూరి జగన్నాథ్ పేరు ముందు చెప్పుకోవాలి. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయి ఉండి కూడా ఏ హడావుడి లేకుండా రెండు మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసేస్తుంటాడు పూరి. మహేష్ లాంటి బడా హీరోతో సైతం ‘బిజినెస్ మేన్’ సినిమాను 74 రోజుల్లోనే తీసేశాడు. ఇక కాస్త చిన్న సినిమాలైతే చెప్పనక్కర్లేదు. 50 రోజుల్లోనే పనైపోతుంది. ఆ మధ్య ఇషాన్ అనే కన్నడ కుర్రాడిని హీరోగా పెట్టి ‘రోగ్’ అనే సినిమాను పూరి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో ఈ సినిమా ఆగిపోయినట్లుగా కూడా వార్తలొచ్చాయి కానీ.. అదేమీ లేదని చెప్పాడు పూరి. ముందు అనుకున్న ప్రకారమే ఈ సినిమాను పూర్తి చేసేశాడు.

చడీచప్పుడు లేకుండా ‘రోగ్’ మూవీని అవగొట్టేసి.. ఈ రోజే కళ్యాణ్ రామ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. ఈ సినిమా తీస్తూనే ‘రోగ్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పర్యవేక్షించబోతున్నాడు పూరి. కొత్త హీరో కావడంతో ప్రమోషన్ భారీ లెవెల్లో చేసి.. ఆ తర్వాత మంచి టైమింగ్ చూసి ‘రోగ్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. శ్రీకాంత్ తో ‘మహాత్మ’ సినిమా తీసిన సీఆర్ మనోహర్ కొడుకే ఈ ఇషాన్. వీళ్లది కర్ణాటక కావడంతో సినిమాను తెలుగు-కన్నడ భాషలు రెండింట్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. కేవలం పూరి పేరు మీదే ఈ సినిమా నడవాల్సి ఉంది. పూరికి కన్నడ నాట కూడా మంచి పేరే ఉంది. ప్రస్తుత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అరంగేట్రం పూరి మీదే జరిగిందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి పూరి రూ.10 కోట్ల దాకా పుచ్చుకున్నట్లు సమాచారం.
Tags:    
  • Puri Jagannath 
  • Rogue Movie 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS