సీఎం జగన్ పై పూరి జగన్ ప్రశంసలు.. ఏమన్నాడంటే.?

Update: 2020-07-02 06:36 GMT
ఏపీ సీఎం జగన్ పై పూరి జగన్ ప్రశంసలు కురిపించారు. ఈ టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్  సీఎం జగన్ చేసిన పనికి ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా అత్యాధునిక టెక్నాలజీతో 1088... 104,108 అంబులెన్స్ లను ప్రారంభించిన సీఎం జగన్ తీరు అద్భుతం అంటూ కొనియాడారు.

ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న వేళ  ప్రజల కోసం ఇటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్  సంక్షేమం పట్ల చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు సార్ అంటూ పూరి జగన్నాథ్ కొనియాడారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యం వీటితో మెరుగవుతుందని పూరి ప్రశంసించారు.

ఇక ఇదే విషయంపై టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ స్పందించారు. ఒకే రోజు 1088 అంబులెన్స్ సర్వీసు వాహనాలను ప్రారంభించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇలా సీఎం జగన్ పై ప్రముఖ జర్నలిస్టులు, కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల నుంచి 104 అంబులెన్స్ ల అమలుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Tags:    

Similar News