పునీత్ రాజ్ కుమార్ కళ్లు దానం.. ఆయన జీవిత విశేషాలివే..

Update: 2021-10-29 10:30 GMT
ప్రముఖ కన్నడ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46 ) మరణించడం కన్నడ చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపడిపోయిన ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్ ప్రాణాలు దక్కలేదు.

పునీత్మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్ర లోటు అని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

-పునీత్ కళ్లు దానం
పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నారు. ఆయన కళ్లను దానం చేయనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. గతంలో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను మరొకరి కోసం కుటుంబీకులు దానం చేసి కొత్త వెలుగు ప్రసాదించారు.

-పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిగత జీవితం
1975 మార్చి 17న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్-పార్వతమ్మ దంపతుల మూడో సంతానంగా పునీత్ జన్మించాడు. అందరూ అభిమానంగా అప్పూ అని ఈయనను పిలుచుకుంటారు. పునీత్ కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం చెన్నై నుంచి మైసూరుకు తరలివచ్చింది. తండ్రి వారసత్వంగా చిన్న నాటి నుంచే సినిమాల్లో నటిస్తూ మెప్పించి కన్నడ పవర్ స్టార్ గా పునీత్ ఎదిగాడు. ఆయన చివరి సినిమా ‘యువరత్న.

-కర్ణాటకలో హైఅలెర్ట్
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధానమార్గాల్లో బందోబస్తు పెంచారు. రెండు రోజులు థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్ అభిమానులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Tags:    

Similar News