పోటీ ఏమో మన్మథుడితో.. ప్రమోషన్సేమో వీక్!

Update: 2019-08-07 05:20 GMT
బుల్లితెరపై హాట్ యాంకరింగ్ తో ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసిన హాట్ లేడీ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.  'క్షణం'.. 'రంగస్థలం' లాంటి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది.  'రంగస్థలం' లోని రంగమ్మత్త  పాత్ర అనసూయకు ఎంత పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే.  తాజాగా అనసూయ 'కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అనసూయ లీడ్ రోల్ లో నటించింది.

ఈ చిత్రం నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' తో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనుంది.  అయితే 'మన్మథుడు 2'  ప్రమోషన్స్ విషయంలో ఫుల్ జోష్ లో ఉంది.   నాగ్.. రకుల్.. రాహుల్ రవీంద్రన్ లు ఇంటర్వ్యూలు ఇస్తూ ఏదో ఒక ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతూ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 'కథనం' విషయానికి వచ్చేసరికి అనసూయ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం.. గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేయడం తప్ప ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టడం లేదు.  వెబ్ ఛానల్స్.. టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. బిగ్ బాస్ లాంటి టీవీ షోస్ లో పాల్గొనడం.. లాంటివి ఏవీ కనిపించడం లేదు.  'కథనం' సినిమాకు సెల్లింగ్ పాయింట్ అనసూయ మాత్రమే కాబట్టి కాస్త ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటే ఆడియన్స్ కు సినిమాపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
Read more!

అనసూయ గ్లామర్ ను మాత్రమే నమ్ముకోకుండా అన్నిరకాల ప్రమోషన్స్ చేస్తేనే ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  సినిమా రిలీజ్ కు రెండు రోజులే ఉంది కాబట్టి  'కథనం' టీమ్ ఏం చేస్తుందో వేచి చూడాలి. 'కథనం' లో శ్రీనివాస్ అవసరాల.. వెన్నెల కిషోర్.. ధనరాజ్ ఇతర కీలక పాత్రలలో నటించారు.  సునీల్ కాశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు రాజేష్ నాదెండ్ల.  బట్టేపాటి నరేంద్ర రెడ్డి.. చుక్కా శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
Tags:    

Similar News