• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ మీరంతా మీసం మెలేసి...

మళ్లీ మీరంతా మీసం మెలేసి తొడగొట్టేలా మరో సినిమా చేస్తాం!

By - Tupaki Desk
Update: 2022-03-13 02:35 GMT
బాలకృష్ణ తన స్థాయికి తగిన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుండగా దక్కిన అనూహ్యమైన విజయమే 'అఖండ'. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. తొలి రోజు నుంచే కొత్త రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా, నిన్నటితో 100 రోజులను పూర్తిచేసుకుంది. కర్నూల్ లో జరిగిన ఈ 100 రోజుల పండుగలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. "ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి ఇక్కడికి వచ్చాము.

ఇంతదూరం ప్రయాణం చేస్తూ వచ్చినప్పటికీ మా ఊరికి వచ్చినట్టుగానే ఉంది తప్ప, బయట ఊరికి వచ్చినట్టుగా లేదు. మాకు అనిపించింది మాకు ఇచ్చేటప్పుడు మీ కర్నూల్ ను కూడా కలిపి ఇస్తే బాగుండేదని.

మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలని వస్తే .. ఇక్కడ ఇంతమంది జనాలను చూసిన తరువాత మీరే మాకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చారేమోనని అనిపిస్తోంది. ఒక సినిమా 100 రోజులు ఆడటమనేది నేను ఒకప్పుడు విన్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా 100 రోజుల దిశగా పరుగులు తీయడం విశేషం.

ప్రపంచం మొత్తంలో గడచిన రెండేళ్లలో చూసుకుంటే, పాన్ ఇండియా .. పాన్ వరల్డ్ అని చెప్పుకుంటున్న సినిమాల వసూళ్లన్నీ కలుపుకున్నా, తెలుగులో ఒక 'అఖండ' .. ఒక 'పుష్ప' సినిమాకి వచ్చినంత కలెక్షన్ లేదు. ఒక సినిమాను మీరు ఆదరించడమంటే కొన్ని వేల కుటుంబాలకు మీరు ఒక భరోసా ఇచ్చినట్టు.

అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణగారి అభిమానులు మీసం మెలేసి తొడగొట్టే సినిమా ఒకటి అతి త్వరలో ఆయనతో చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒక మంచి రోజును చూసుకుని ఆయనను కలవడం జరుగుతుంది. అలాంటి సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తాము" అని చెప్పుకొచ్చాడు.       
Tags:    
  • Miriyala Ravinder Reddy 
  • Akhanda Kruthagnatha Sabha 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS