• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నెమ్మదిగా లైన్ లో...

నెమ్మదిగా లైన్ లో పడుతున్న విజయ్ హీరోయిన్..!

By - Tupaki Desk
Update: 2020-11-03 02:30 GMT
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమాతో తళుక్కున మెరిసింది యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిలిమ్స్ - మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఈ భామ ముందుగా 'కల వరం ఆయే' అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడంతో ప్రియాంక ఎవరికీ పరిచయం లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన 'టాక్సీవాలా' సినిమా సక్సెస్ అవడంతో యూత్‌ లో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకుంది. ప్రియాంక జవాల్కర్ తెలుగు నేపథ్యం ఉన్న హీరోయిన్. అందులోనూ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 'టాక్సీవాలా' చిత్రం విజయం హిట్ అవడం.. యువతని ఆకర్షించే అందం కూడా జవాల్కర్ కి ఉండటంతో ఆమె టాలీవుడ్ లో దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రియాంక కు అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ మళ్ళీ లైన్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రియాంక జవాల్కర్.

'టాక్సీవాలా' త‌రువాత మ‌రో అవ‌కాశం కోసం చాలా రోజులు వెయిట్ చేసిన ఈ బ్యూటీకి ''ఎస్.ఆర్.క‌ళ్యాణమండ‌పం'' అనే సినిమాలో నటించే ఛాన్స్ వ‌చ్చింది. 'రాజావారు రాణిగారు' ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు వీడియో సాంగ్ లో ప్రియాంక జవాల్కర్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో సుజ‌నా రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''గ‌మ‌నం'' అనే పాన్ ఇండియా మూవీలో ప్రియాంక నటిస్తోంది. శ్రీయా - నిత్యా మీనన్ - శివ కందుకూరి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జారా అనే ముస్లిం యువతి పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు తాజాగా జవాల్కర్ 'తిమ్మ‌రుసు' సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. టాలెంటెడ్ యాక్టర్ స‌త్య‌దేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ కోనేరు - సృజన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా ఆఫర్స్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రియాంక జవాల్కర్ ఇలా మూడు సినిమాలతో బిజీగా మారిపోయిందని చెప్పవచ్చు.
Tags:    
  • Priyanka Jawalkar 
  • SR Kalyanamandapam 
  • Gamanam 
  • Thimmarusu 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS