ప్యాంటీ క‌నిపించాలి.. బ‌ట్ట‌లు విప్పాల‌న్న డైరెక్ట‌ర్!!

Update: 2021-02-11 05:57 GMT
ప్రియాంక చోప్రా ఆత్మకథ `అన్ ఫినిష్డ్` ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. ఈ పుస్త‌కం ఇలా లాంచ్ అయ్యిందో లేదో అలా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని కుదిపేస్తోంది. ఈ పుస్తకంలో ఓ బాలీవుడ్ డైరెక్టర్ అరాచకాన్ని బయటపెట్ట‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాను ఆరంగేట్ర క‌థానాయిక‌గా ఉన్న రోజుల్లో ఒక ద‌ర్శ‌కుడు త‌న శ‌రీర భాగాల్ని స‌ర్జ‌రీ చేయించుకోమ‌న్నాడ‌ని చెప్పిన పీసీ.. అత‌డి దురాగ‌తాన్ని బ‌హిరంగంగా వెల్ల‌డించింది. `నీ వ‌క్షోజాలు చిన్న‌వి.. పిరుదులు పెద్ద‌వి.. లాస్ ఏంజెల్స్ (అమెరికా)లో డాక్ట‌ర్ నాకు తెలుసు. స‌ర్జ‌రీ చేయించుకో!`` అని స‌ల‌హా ఇచ్చాడ‌ని వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత షాక్ కి గురైన తాను మేనేజ‌ర్ ని మార్చేశాన‌ని తెలిపారు.

ఓ ఐటెమ్ సాంగ్ తెర‌కెక్కించే క్ర‌మంలో వేర‌క బాలీవుడ్ ద‌ర్శ‌కుడు త‌న‌ని పూర్తిగా బ‌ట్ట‌లు విప్పాల‌ని అన్నారట‌. ``అయితే త‌న శ‌రీరం క‌నిపించ‌కుండా ఇంచుమించు త‌న శ‌రీర రంగులో క‌లిసిపోయే  దుస్తుల్ని ధ‌రిస్తాన‌ని ప్రాధేయ‌పడ్డాను. కానీ అత‌డు స్టైలిష్ట్ తో మాట్లాడాల‌ని అన్నారు. స్టైలిస్ట్ కి ఫోన్ చేస్తే .. మీరు ఏదైనా చేయండి .. మీ ప్యాంటీలు తెర‌పై క‌నిపించాలి. అలా క‌నిపిస్తేనే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు!`` అని త‌న‌తో అన్నార‌ని.. దాంతో కోపంతో ఊగిపోయాన‌ని పీసీ తెలిపింది.

ఆ త‌ర్వాత ఆ విష‌యం స‌ల్మాన్ ఖాన్ కి చెప్ప‌గా.. అత‌డి జోక్యంతో స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింద‌ని కూడా పీసీ వివ‌రించారు. తాను స‌ల్మాన్ తో సెట్స్ కి రాగానే ఖంగు తిన్న అత‌డు చాలా కంగారు ప‌డ్డార‌ని కూడా పీసీ వెల్ల‌డించారు. రంగుల తెర వెన‌క వ‌ల ఎలా విసురుతారో పీసీ అన్ ఫినిష్డ్ ఆత్మ‌క‌థ‌లో స‌వివ‌రంగా రాసార‌‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.
Tags:    

Similar News