ప్ర‌శాంత‌త కోస‌మే ఆ ప‌ని.. అంత వేధించారా?

Update: 2020-06-04 06:30 GMT
ఇటీవల సోష‌ల్ మీడియాల నుంచి వైదొల‌గిన వింక్ గాళ్‌ ప్రియా ప్రకాష్ వారియర్ పై అభిమానులు బెంగ పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అమ్మ‌డు ఇంత‌లోనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‌లో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. తాను అలా ఇన్ స్టా నుంచి వైదొల‌గ‌డానికి అసలు కారణాన్ని ఓ వీడియో చాట్ లో వివరించింది.

``నేను నా ఖాతాను ఎందుకు తొల‌గించాను.. కొంతకాలంగా అన్నింటికీ ఎందుకు దూర‌మ‌య్యాను? ఇన్ ‌స్టా‌లో ఎందుకు లేవు? అని మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు. కొంత విరామం తీసుకోవాలనే అలా చేశాను. లాక్ డౌన్ కారణంగా అందరూ ఆన్ లైన్ ‌లో 24 * 7 ఉన్నారు అని చాలా మంది అంటున్నారు. ఇలాంటి సమయంలో నువ్వెందుకిలా చేశావు? అని ప్ర‌శ్నించారు.  అయితే నా మానసిక ఆరోగ్యం ప్ర‌శాంత‌త‌ను మించి ఇంకేదీ అక్క‌ర్లేద‌నిపించింది. అందుకే మరేమీ ఆలోచించలేదు. నా మనస్సు నాకు ముఖ్యమైనది. నేను చేసిన పనిలో ఎటువంటి ప్ర‌త్యేక తార్కిక ఆలోచ‌న‌ లేకపోయినా.. నిజం చెప్పాలంటే, గత రెండు వారాలుగా ప్రశాంతంగా ఉన్నాను`` అని ప్రియా తెలిపింది.

ఈ రెండు వారాలు నేను చాలా ఆనందించాను. నిజాయితీగా ఉండటానికి ప్ర‌య‌త్నించి ప్రశాంతంగా ఉన్నాను. సోషల్ మీడియా లేదా ఇన్ ‌స్టాగ్రామ్ వ‌ల్ల‌ గందరగోళానికి గురికాకూడదని నేను ఎప్పుడూ అనుకున్నాను.  వీటి వ‌ల్ల నేను కొంత ఒత్తిడికి గుర‌య్యాన‌నిపించింది. అందువల్ల వ‌దిలేయ‌డ‌మే ఉత్తమ మార్గం అనుకున్నా... అందుకే ఇన్ స్టా వ‌దిలేశాను అని తెలిపింది  ప్రియా. సోషల్ మీడియా వేదికను విడిచిపెట్టడానికి ట్రోలింగ్ లేదా ప్రచారం పొందడం రెండూ కార‌ణం కాద‌ని తెలిపింది.

హెల్ధీ ట్రోలింగ్ ఎల్లప్పుడూ మంచిది అని ఆమె వీడియోలో పేర్కొంది. భవిష్యత్తులో తనకు న‌చ్చ‌క‌పోతే  ఇన్ స్టా నుంచి మ‌ళ్లీ వైదొల‌గుతాన‌ని తెలిపింది. ప్రియా ప్ర‌కాష్ న‌టించిన శ్రీ‌దేవి బంగ్లా వివాదాస్ప‌ద‌మై రిలీజ్ కి నోచుకోని సంగ‌తి తెలిసిందే. సెన్సార్ ఇబ్బందుల వ‌ల్ల ఈ మూవీ లాక్ డౌన్ అయ్యింది. మ‌రి ఎప్ప‌టికి రిలీజ‌వుతుందో చూడాలి.
Tags:    

Similar News