ఈమె ఎవరో గుర్తు పట్టగలరా సినీ లవర్స్?
హీరోలు మహిళా గెటప్ వేయడం అంటే అది సాహసమే. అమ్మాయిగా వేషధారణతో కనిపిస్తే సరిపోదు.. ఆహార్యం మాట తీరు.. బాడీ లాంగ్వేజ్.. ప్రతిదీ సెట్టవ్వాలి.;
హీరోలు మహిళా గెటప్ వేయడం అంటే అది సాహసమే. అమ్మాయిగా వేషధారణతో కనిపిస్తే సరిపోదు.. ఆహార్యం మాట తీరు.. బాడీ లాంగ్వేజ్.. ప్రతిదీ సెట్టవ్వాలి. ప్రేమ కలాపాల్లో ఒదిగిపోయి నటించాలి. అయితే ఇలాంటి వేషధారణలతో మెప్పించిన ప్రముఖులలో ఏఎన్నార్, కమల్ హాసన్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ, విశ్వక్ సేన్ లాంటి దిగ్గజ హీరోలు ఉన్నారు.
ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అలాంటి సాహసం చేసారు. అతడు నటించిన 45 చిత్రంలో మహిళా గెటప్ నిజంగా అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషించగా, ఇటీవలే ఘనంగా విడుదలైంది. ఇది రెగ్యులర్ సినిమా కాదు.. సాంప్రదాయ కథనాలకు సవాలు విసిరే ప్రత్యేక కథనంతో అలరిస్తుందని కూడా ప్రచారం సాగించారు. శివరాజ్ కుమార్ కెరీర్ లో ఇది సాహసోపేతమైన ప్రయత్నమని కూడా ప్రచారమైంది.
అయితే ఈ సినిమా ఎలా ఉంది? అనేదాని కంటే ఇందులో అతడు మహిళా గెటప్ తో ఎలా నటించాడు? అన్నదే ఆసక్తిగా మారింది. లుక్ వరకూ అతడు సరిగ్గానే కుదిరాడు. లేడీ గెటప్ లోనే మరింత అందంగా ఉన్నాడు! అంటూ ఫ్యాన్స్ ప్రశంసించారు. ఈ చిత్రం గురించి శివన్న మాట్లాడుతూ.. ``45 నా 129వ చిత్రం. నా మొదటి చిత్రం ఆనంద్ చేసేటప్పుడు నాకు ఎలాంటి భయం - భక్తి ఉన్నాయో, ఈ సినిమా చేసేటప్పుడు కూడా అవే ఉన్నాయి. అర్జున్ జన్య నాకు ఈ కథ చెప్పినప్పుడు, నేను చాలా ఆశ్చర్యపోయాను. అతనికి అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో అని నేను ఆశ్చర్యపోయాను. 45 అంటే ఏదైనా కావచ్చు.. ఒక రోజు, ఒక సెకను, ఒక నిమిషం. ఇది ఒక్క వ్యక్తి సినిమా కాదు.. ఇది చూసే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది..కనెక్ట్ చేస్తుంది`` అని అన్నారు. డిసెంబర్ 25న కన్నడలో విడుదలైన తర్వాత, ఈ చిత్రం జనవరి 1, 2026న హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో థియేటర్లలోకి రానుంది.
శివరాజ్ కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ `పెద్ది` చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అతడు రజనీకాంత్ జైలర్ 2 లో కూడా పెద్ద పాత్రలో నటిస్తున్నానని ఘనంగా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలు అతడికి గేమ్ ఛేంజర్ గా మారతాయని ఆశిస్తున్నాడు. శివరాజ్ కుమార్ టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు అత్యంత సన్నిహితుడు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఆయన లెగసీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.