ఎల్లమ్మ అనౌన్స్ మెంట్ తోనే ట్రెండ్ చేసే ప్లాన్..?

ఎల్లమ్మ టైటిల్ తో వస్తున్న వేణు యెల్దండి మూవీ కాస్టింగ్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఎల్లమ్మ హీరో అతను అంటూ గత ఏడాది కాలంగా చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి.;

Update: 2025-12-29 18:30 GMT

బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి.. కమెడియన్ తన డైరెక్షన్ లో సినిమా అంటే ఏదో ఒక కామెడీ సినిమా చేస్తాడులే అనుకుంటే ప్రేక్షకుల హృదయాలను బరువెక్కే సినిమా తీసి షాక్ ఇచ్చాడు. ఆ ఒక్క సినిమాతో కమెడియన్ వేణు కాస్త డైరెక్టర్ వేణుగా తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే వేణు బలగం హిట్ పడగానే చాలామంది ఆఫర్లు ఇచ్చినా తనకు మొదట డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుతోనే రెండో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. బలగం తర్వాత దానికన్నా బలమైన ఎమోషన్స్ ఉన్న ఒక కథతో రావాలని చూస్తున్నారు.

ఎల్లమ్మ హీరో మాత్రమే కాదు హీరోయిన్ విషయంలో కూడా..

ఎల్లమ్మ టైటిల్ తో వస్తున్న వేణు యెల్దండి మూవీ కాస్టింగ్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఎల్లమ్మ హీరో అతను అంటూ గత ఏడాది కాలంగా చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి కానీ వాటిలో ఏది వాస్తవం కాదని తేలింది. ఎల్లమ్మ హీరో మాత్రమే కాదు హీరోయిన్ విషయంలో కూడా మేకర్స్ ఒక క్లారిటీకి రాలేదట. ఈ కథ ఎవరెవరి దగ్గరకు వెళ్తుందో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు.

ఐతే ఎల్లమ్మ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని దిల్ రాజు టీం చెబుతుంది. అంతేకాదు ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే ట్రెండ్ సృష్టించేలా ప్రమోషనల్ కంటెంట్ తో వస్తున్నారట. ఎల్లమ్మకి కాస్టింగ్ ఎవరన్నది ఒక సస్పెన్స్ అయితే సినిమా ప్రకటనతోనే ప్రమోషన్స్ తో మెగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

దిల్ రాజు ఎల్లమ్మ మీద పెడుతున్న అటెన్షన్..

బలగం హిట్ పడింది కాబట్టి వేణుకి బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు దిల్ రాజు. అంతా బాగుంది కానీ ఎల్లమ్మ అనౌన్స్ మెంట్ తో ట్రెండ్ సృష్టించే కాస్టింగ్ ఏంటి సినిమా నుంచి ఏది రిలీజ్ చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని అనుకుంటున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా దిల్ రాజు ఎల్లమ్మ మీద పెడుతున్న అటెన్షన్ చూస్తుంటే సినిమాను కేవలం తెలుగు వరకే కాకుండా పాన్ ఇండియా ప్లానింగ్ ఏదైనా ఉందా అన్న డిస్కషన్ కూడా వస్తుంది. డివోషనల్ సబ్జెక్ట్ కాబట్టి నేషనల్ ఆడియన్స్ కి ఎల్లమ్మ చేరేలా ప్లానింగ్ ఏమైనా ఉందేమో త్వరలో తెలుస్తుంది.

వేణు మాత్రం తనకు వచ్చిన ఈ ఫ్రీ టైం మొత్తం సినిమా కథ, స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. బలగం తర్వాత ద్వితీయ విఘ్నం వేణు దాటుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నాని, నితిన్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్, కార్తి ఇలా అందరు హీరోలు దాటుకుని ఈ ఛాన్స్ ఎవరు అందుకుంటారో తెలుసుకోవాలని ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.

Tags:    

Similar News