• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిగ‌రెట్ కాల్చ‌క‌పోయినా...

సిగ‌రెట్ కాల్చ‌క‌పోయినా ధోనీకి చీవాట్లు

| నిజానికి ఆ కార్ లో వెన‌క సీట్‌లో సిగ‌రెట్ ప్యాకెట్ క‌నిపిస్తోంది. అక్క‌డ‌ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని, ఇత‌ర బంధువు ఒక‌రు కూచుని ఉండ‌గా, ధోని ముందు సీట్‌లో కూచుని ఉన్నాడు.

By - Sivaji Kontham
Update: 2025-12-29 18:30 GMT

ఇష్యూ చేయాల‌నుకుంటే, ప్ర‌తిదీ ఇష్యూనే. అవ‌స‌రం లేదు అనుకుంటే, ఏదీ ఇష్యూ కాదు. ఇక్క‌డ నెటిజ‌నులు ఇష్యూ చేయాల‌నుకున్నారో ఏమో కానీ ఎం.ఎస్.ధోనీ అలాంటి త‌ప్పు చేసాడు! అంటూ సోష‌ల్ మీడియాల్లో ర‌భ‌స మొద‌లైంది. అత‌డు సిగ‌రెట్ నోట్లో పెట్టుకుని ఊద‌క‌పోయినా, క‌నీసం సిగ‌రెట్ పై అటెన్ష‌న్ చూపించే స్థితిలో లేక‌పోయినా కానీ, ఇప్పుడు అత‌డిని నెటిజ‌నులు త‌ప్పు ప‌డుతూ, విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి ఆ కార్ లో వెన‌క సీట్‌లో సిగ‌రెట్ ప్యాకెట్ క‌నిపిస్తోంది. అక్క‌డ‌ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని, ఇత‌ర బంధువు ఒక‌రు కూచుని ఉండ‌గా, ధోని ముందు సీట్‌లో కూచుని ఉన్నాడు. పైగా సీట్ బెల్ట్ పెట్టుకుని ప‌ద్ధ‌తిగా కార్ డ్రైవ్ చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఆ స‌మ‌యంలో అత‌డు సిగ‌రెట్ తాగ‌లేదు.. సిగ‌రెట్ ప్యాకెట్ ని చేత్తో ప‌ట్టుకోలేదు..ఎలాంటి వ్యామోహం క‌నిపించ‌లేదు. అయినా పెద్ద దుమారం చెల‌రేగింది. ఎంఎస్.ధోని , అత‌డి కుటుంబ స‌భ్యులు హానికరమైన అలవాటును ప్రోత్సహించారని విమర్శిస్తూ చాలామంది తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ధోనీ పేరును ప్ర‌స్థావిస్తూ చాలా మంది అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతున్నారు.

ప్ర‌స్తుతం ధోనీ కార్ లో వెళుతున్న ఈ స్పెష‌ల్ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. అయితే సోష‌ల్ మీడియాల్లో ధోనీని విమ‌ర్శిస్తున్న వారికి కౌంట‌ర్లు వేస్తూ ధోనీ ఫ్యాన్స్ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఒక‌రి వ్య‌క్తిగ‌త జీవితంపై ఎందుకు ఇంత‌గా త‌ర‌చి చూస్తున్నారు? అని కామెంట్ చేసారు. ఇలాంటి విష‌యాల‌లో హ‌ద్దు మీర‌డం స‌రికాద‌ని చాలా మంది సూచించారు. అత‌డు, అత‌డి కుటుంబం ఎలా జీవించాలో మీరు నిర్ధేశిస్తారా? అని కొంద‌రు ప్ర‌శ్నించారు. ఇలా అగౌర‌వంగా కామెంట్లు చేయ‌డం స‌రికాదు.. ఒక సెల‌బ్రిటీని, అత‌డి కుటుంబ వ్య‌క్తిగ‌త అల‌వాట్ల‌ను ప్ర‌శ్నించే హ‌క్కు మీకు లేదు. వ్య‌క్తుల‌ను వ్య‌క్తిగ‌తంగా ట్రోల్ చేయొద్ద‌ని కొంద‌రు సూచించారు.

ఎవ‌రూ ఎవ‌రినీ గుడ్డిగా అనుకరించ‌రు. సెల‌బ్రిటీ జీవితంలోని ప్రతి అంశంలోనూ ప్రేరణ అంటే అనుకరణ కాదని మీరు అర్థం చేసుకోవాలి. క్ర‌మ‌శిక్ష‌ణ విలువ‌లు తెలిసిన‌వాడు గ‌నుక‌నే ధోని అంతర్జాతీయ క్రికెట్ లో ఆడాడు. అలాంటి వ్య‌క్తిని తూల‌నాడ‌టం స‌రికాద‌ని ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసారు.



𝗖𝗶𝗴𝗮𝗿𝗲𝘁𝘁𝗲 𝗕𝘂𝗻𝗱𝗹𝗲 𝗶𝗻 𝗠𝗦 𝗗𝗵𝗼𝗻𝗶’𝘀 𝗖𝗮𝗿 🚭😲

While heading to Salman Khan’s birthday party, a bundle of cigarettes was spotted inside MS Dhoni’s car.
The video has now gone massively viral on the internet. pic.twitter.com/xqazqhX4pz

— Jara (@JARA_Memer) December 29, 2025


Tags:    
  • msdhoni 
  • dhonitrolling 
  • dhonifans 
  • celebritycontroversy 
  • socialmediatrolls 
  • cigaretteissue 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS