తెలుపు రంగులో శ్రీలీల మ్యాజిక్.. దేవకన్యలా మెరిసిపోతోందిగా!

టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే తన ఎనర్జీతో, డ్యాన్సులతో ఓ ఊపు ఊపేసింది శ్రీలీల. అయితే ఈమధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ వద్ద అస్సలు కలిసి రావడం లేదు.;

Update: 2025-12-29 18:51 GMT

టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే తన ఎనర్జీతో, డ్యాన్సులతో ఓ ఊపు ఊపేసింది శ్రీలీల. అయితే ఈమధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ వద్ద అస్సలు కలిసి రావడం లేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా నిరాశ పరుస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం తన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. వెండితెరపై సక్సెస్ లేకపోయినా, తన గ్లామరస్ ఫొటోషూట్స్​తో ఫ్యాన్స్​ను ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. లేటెస్ట్ గా శ్రీలీల షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




ఈ లేటెస్ట్ ఫొటోషూట్​లో శ్రీలీల తెలుపు రంగు డ్రెస్ లో మెరిసిపోతోంది. వైట్ అనార్కలీ డ్రెస్, దానిపై లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న దుపట్టా ధరించి అచ్చం దేవకన్యలా కనిపిస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తుంటే, మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కృతజ్ఞత అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్, ఆ ఫొటోల్లోని పీస్​ఫుల్ వైబ్స్​కు పర్ఫెక్ట్​గా సరిపోయింది.




ఈ లుక్​లో శ్రీలీల అందం మరింత హైలైట్ అవ్వడానికి ఆమె ఎంచుకున్న ఆభరణాలు ప్రధాన కారణం. చెవులకు ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ చేతికి నిండుగా వెండి గాజులు ధరించి వింటేజ్ లుక్​ను సొంతం చేసుకుంది. నుదుటిన చిన్నని వెండి బొట్టు, కళ్ళకు కాటుక, న్యాచురల్ పింక్ లిప్స్.. ఇలా ప్రతి డీటైల్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చాయి. సాధారణంగా శ్రీలీల అంటేనే గలగలా మాట్లాడే ఎనర్జీ, మాస్ డ్యాన్సులు గుర్తొస్తాయి. కానీ ఈ ఫొటోల్లో ఆమె చాలా సైలెంట్​గా, కళ్ళతోనే భావాలను పలికిస్తూ క్లాసీగా కనిపిస్తోంది.

ఇక శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన 'రాబిన్ హుడ్', అలాగే 'మాస్ జాతర' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఈ పరాజయాలు ఆమె కెరీర్​పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కేవలం గ్లామర్, డ్యాన్స్ ఉంటే సరిపోదు, కథల ఎంపికలో జాగ్రత్త పడాలని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఆమెకు సరైన సక్సెస్ ఒక్కటి కూడా లేదు. ఇక తమిళ్ లో నటించిన పరాశక్తి రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే హిందీలో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News