• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలాంటి టైంలో ఈ డప్పు...

ఇలాంటి టైంలో ఈ డప్పు కొట్టించుకోవడం అవసరమా...?

By - Tupaki Desk
Update: 2020-04-30 02:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రెటీలు లాక్ డౌన్ సమయాన్ని 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజుతో టైమ్ పాస్ చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ లో ఇప్పుడు స్టార్ హీరోలు సైతం పాల్గొంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనుల్లో ఆడవారికి సాయపడాలనే ఉద్దేశ్యంతో మొదలైన ‘బి ద రియల్ మ్యాన్‘ ఛాలెంజ్ టాలీవుడ్ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరికి చేరుతూ ముందుకు సాగుతోంది. ఈ ఛాలెంజ్ లో ఒకరిద్దరు మినహా ఇప్పటికే స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లు.. మ్యూజిక్ డైరెక్టర్లు.. నిర్మాతలు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ ఛాలెంజ్ లు సెలబ్రెటీలు ఇంట్లో పనుల కోసం కాదు.. వారి ప్రమోషన్స్ కోసమే చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వస్తున్నాయి.

అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగాని వాడుకొని 'బీ ది రియల్ మ్యాన్' అని ఏదో వాళ్ళ ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రొమోషన్స్ కోసం ట్రిపుల్ ఆర్ టీమ్ ట్రై చేస్తోందని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు అందరూ దాన్ని వాడుకొని హీరోలంతా కూడా ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సరేలే లాక్ డౌన్ టైమ్ ని ఇలా యూజ్ చేసుకుంటున్నారులే పోనిలే అనుకుందాం. అయితే ఇప్పటి దాకా ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమైంది. ఇప్పుడు ఎల్లలు దాటి ఏకంగా ప్రెస్ నోట్లు కూడా పంపించేంత వెర్రి లోకి వచ్చేసింది.

వివరాల్లోకి వెళ్తే 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజులో భాగంగా లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సవాలుని స్వీకరించవలసిందిగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దేవిశ్రీ కూడా సుక్కు విసిరిన ఛాలెంజ్‌ ను పూర్తి చేసినట్లు ట్వీట్ చేసి వీడియో రిలీజ్ చేసాడు. రియల్ మ్యాన్ లను తయారు చేసిన 'అమ్మ'లందరికీ ఈ వీడియో అంకితం అంటూ వీడియో ద్వారా తెలియజేసాడు. అనంతరం ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎఫర్ట్స్ పెట్టిన సందీప్ వంగా, -రాజమౌళి - చిరంజీవి లను ట్యాగ్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ ను కొనసాగించాల్సిందిగా అల్లు అర్జున్ - తమిళ హీరో కార్తీ - కన్నడ హీరో యశ్ - హరీష్ శంకర్ - దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌ లను నామినేట్ చేశాడు.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇప్పటి దాకా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తుండగా ఇప్పుడు ఏకంగా 'దేవిశ్రీ ప్రసాద్ చేసిన వీడియోకి అనూహ్య స్పందన' అని ప్రెస్ నోట్లు కూడా ఇచ్చారట. దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా వల్ల ఇబ్బందులు పడుతుంటే.. ఇలాంటి టైములో ఈ అనవసర ప్రచారం అవసరమా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమాకి సుమారు 3 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకునే దేవిశ్రీ తన మ్యూజిక్ ఫ్యామిలీకి ఏదైనా స్పెషల్ గా సాయం చేయాల్సింది పోయి ఈ డప్పు కొట్టించుకోవడం ఏంటని సినిమా జనాలు విమర్శిస్తున్నారు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Devisri prasad 
  • press notes on devi sri be the realman challange 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS