పరశురామ్ స్క్రిప్టు రెడీ.. హీరో ఎవరు?

Update: 2016-09-14 15:30 GMT
‘సోలో’ సినిమాతో బలమైన ముద్ర వేశాడు యువ దర్శకుడు పరశురామ్. ఐతే ఆ తర్వాత తీసిన ‘సారొచ్చారు’ అతణ్ని గట్టి దెబ్బ కొట్టింది. అయినా డీలా పడిపోకుండా ఈసారి ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి మంచి సినిమాతో పలకరించాడు. ఆ సినిమా కమర్షియల్ గానూ మంచి సక్సెస్ సాధించింది. అల్లు శిరీష్ కు హీరోగా తొలి విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా చేస్తానంటూ.. తనను బయటికి గెంటే వరకు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోనే ఉంటానని చమత్కరించాడు పరశురామ్. అన్నట్లే అతను గీతా ఆర్ట్స్ బేనర్లోనే తన తర్వాతి సినిమాను చేయబోతున్నాడు.

‘శ్రీరస్తు శుభమస్తు’ విడుదలైన నెల రోజులకే పరశురామ్ తన తర్వాతి సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసేయడం విశేషం. బన్నీ వాస్ నిర్మాతగా ‘గీతా ఆర్ట్స్2’ బేనర్లో తర్వాతి సినిమాకు మంచి స్క్రిప్టు రెడీ అయిందంటూ పీఆర్వో ప్రకటించాడు. ఐతే ఈ చిత్రానికి హీరో ఎవరన్నదే సస్పెన్సుగా మారింది. శిరీష్ ఆల్రెడీ రెండు సినిమాలు కమిటయ్యాడు. పైగా పరశురాంతో మళ్లీ అంటే బాగోదు. మరోవైపు బన్నీ పరశురాంకు అందే స్థాయిలో లేడు. అతడికి కూడా కమిట్మెంట్లు చాలా ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో ఇంకెవరూ కూడా అందుబాటులో ఉన్నట్లు లేరు. బహుశా ‘భలే భలే మగాడివోయ్’ తరహాలో ఈసారి బయటి హీరోతో సినిమా చేస్తారేమో. మరి ఎవరా హీరో?
Tags:    

Similar News