విల‌క్ష‌ణ న‌టుడి ఈగోని హ‌ర్ట్ చేసిన ఆర్కే!

Update: 2021-10-15 05:30 GMT
ఇటీవ‌ల జ‌రిగిన `మా` ఎన్నిక‌ల్లో ఎంత ర‌సాభాస చోటు చేసుకుందో తెలిసిందే. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లతో ఎన్న‌డు లేనంతగా గంద‌ర‌గోళ‌ స‌న్నివేశం క్రియేట్ అయింది. ఎన్నిక‌లు మొత్తం మెగా ఫ్యామిలీ వ‌ర్సెస్ మంచు ఫ్యామిలీ అన్న‌ట్లుగానే సాగాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ఫ్యాన‌ల్ కి మెగా ఫ్యామిలీ మ‌ద్ద‌తివ్వ‌గా..మంచు విష్ణుకు వెనుక‌బ‌డిన వ‌ర్గ‌మంతా స‌పోర్ట్ ఇచ్చింది. సామాజిక వ‌ర్గాల వారీగా ఓట్లు చీలాయి. చివ‌ర‌గా మాజీ అధ్య‌క్షుడు వీకే న‌రేష్ మ‌ద్ధ‌తుతో విష్ణు రేసులో గెలుపొందారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థులు ఒక‌రిపై ఒక‌రు హ‌ద్దు మీరి విమ‌ర్శించుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. మోహ‌న్ బాబు అయితే ఏకంగా తిట్ట‌డం..కొట్ట‌డం వంటి చ‌ర్య‌ల‌కే పాల్ప‌డ్డార‌ని ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ ఆరోపించింది. అయితే ఇదంతా ముగిసిన‌ గ‌తం. ఎన్నిక‌లు అన్న త‌ర్వాత ఇలాంటి స‌న్నివేశాలు స‌హ‌జంగానే చోటు చేసుకుంటాయి.

అయితే తాజాగా `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే` ప్రోగ్రామ్ లో హోస్ట్ రాధాకృష్ణ ..ప్ర‌కాష్ రాజ్ ఈగోని హ‌ర్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ``ఈ ఎన్నిక‌ల్లో మీకు మీరుగా నిల‌బ‌డ‌లేదు. మిమ్మ‌ల్ని చిరంజీవి నిల‌బెట్టార‌ని అంటున్నారు. మీకు అస‌లు వాళ్లు నిజంగా స‌పోర్ట్ చేసారా`` అని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆర్కే ప్ర‌శ్నించారు. దీంతో విల‌క్ష‌ణ న‌టుడు చిర్రెత్తిపోయారు. ``నొప్పించ‌క తానొప్ప‌క అన్న‌ట్లు పెద్ద ఫ్యామిలీల‌తోనే అస‌లు స‌మ‌స్య‌. వీళ్లు పోటీలో నిల‌బ‌డ‌రు. కానీ చ‌క్రం తిప్పేది వీళ్లే అన్న‌ట్లు ప‌రోక్షంగా వ్య‌వ‌హ‌రిస్తారు. గ‌న్ చేతిలో ఉంటే నేను మ‌హ‌త్మాగాంధీని కూడా న‌మ్మ‌ను. నీ ఇంటి ప‌రువు పోతుంటే.. నీ రూమ్ మాత్రం క్లీన్ గా ఉంటే చాలా? పెద్ద‌ హీరోలే ఎక్కువ బాధ్య‌త తీసుకోవాలి. కానీ వారు తీసుకోరు. అన్యాయం జ‌రుగుతున్నా ఖండించ‌రా? మ‌ళ్లీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లుగా ఉండాలంటారా? ఈ పెద్ద కుటుంబాల‌తో జాగ్ర‌త్తగా ఉండాలి`` అంటూ రుస‌రుస‌లాడారు.

వీడెన‌క ఎవ‌రున్నారు? వాడెనుక ఎవ‌రున్నారు? అని ఆరాలు తీస్తారు. మంచు విష్ణుని పోటీ నుంచి త‌ప్పుకోమ‌ని చిరంజీవి ఎందుకు చెబుతారు? అది అబ‌ద్దం అయి ఉండొచ్చు క‌దా. ప్ర‌కాష్ రాజ్ ని పోటీలో పెట్టాం అని చెప్ప‌డానికి వాళ్లెవ‌రు? అస‌లు ఏది నిజం? ఏది అబ‌ద్దం? అన్న‌ది మీకెలా తెలుస్తుంది? ఎలాంటి నిర్ధార‌ణ‌తో ప్ర‌శ్నిస్తారు? అని ఆర్కే ని ఎదురు ప్ర‌శ్నించారు. ఇక `మా` ఎంత‌గా అభివృద్ది చెందుతుందో ద‌గ్గ‌రుండి చూస్తా. హామీలు ఇవ్వ‌డం కాదు. వాటిని నెర‌వేర్చాలి. మాట నిల‌బెట్టుకునే వార‌కూ ప్ర‌శ్నిస్తూనే ఉంటా. తెలుగు లో డైలాగులు చెబితే తెలుగు వ‌చ్చేసిన‌ట్లేనా? వాళ్లే తెలుగు వాళ్లా? గుద్దించుకుని తెచ్చుకున్న ఓట్ల‌తో వ‌చ్చింది గెలుపో..ఓట‌మో నాకైతే తెలియ‌దంటూ అన్ని ర‌కాలుగాను విల‌క్ష‌ణ న‌టుడు అంద‌రిపైనా ఎటాక్ చేసారు.

2021-23 కొత్త క‌మిటీ వివ‌రాలు:

ప్ర‌కాష్ రాజ్ తో హోరాహోరీలో గెలిచిన‌ మంచు విష్ణు అధ్య‌క్షుడ‌య్యారు. `మా` ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివ‌రాల్ని ప‌రిశీలిస్తే..

అధ్యక్షుడు- మంచు విష్ణు
జనరల్ సెక్రటరీ- రఘుబాబు
ట్రెజరర్- శివ బాలాజీ
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్- శ్రీకాంత్
వైస్ ప్రెసిడెంట్- బెనర్జీ
వైస్ ప్రెసిడెంట్- మాదాల రవి
జాయింట్ సెక్రటరీ- గౌతమ్ రాజు

ఎగ్జిక్యూటివ్ మెంబర్లు..

1. శివారెడ్డి
2. గీతాసింగ్
3. అశోక్ కుమార్
4. బ్రహ్మాజీ
5. శ్రీలక్ష్మీ
6. మాణిక్
7. ఈటీవీ ప్రభాకర్
8. అల్లాడి తనీష్
9. ఘర్షణ శ్రీనివాస్ పసునూరి
10. హరనాథ్ బాబు
11. కొండేటి సురేష్
12. N. శివన్నారాయణ
13. సంపూర్నేష్ బాబు
14. GS శశాంక్
15. సమీర్
16. సుడిగాలి సుధీర్
17. బొప్పన విష్ణు
18. కౌశిక్




Tags:    

Similar News