ఆదిపురుష్.. సలార్ ముందే వస్తుందేమో?
ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందేమో అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసినప్పటికీ కూడా లాభం దక్కలేదు. ఆ సినిమా గ్రాఫిక్స్ పనులను కోసం చిత్ర యూనిట్ సభ్యులు మరింత సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఎలాగైనా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలి అని ప్రభాస్ మళ్లీ రీ వర్క్ అయితే చేయిస్తున్నాడు.
అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి నుంచి వాయిదా పడడంతో జూన్లో విడుదల చేయాలని మరొక ప్రకటన అయితే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదిపురుష్ సినిమా పనులు ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికను రచించుకున్నప్పటికీ కూడా గ్రాఫిక్స్ పనులు నిర్వహించే సంస్థ మాత్రం ఇంకాస్త సమయం కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది.
చిత్ర యూనిట్ కూడా సినిమాను ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఆ విషయంలో మరోసారి ఆలోచిస్తున్నారు. ఇక అటు ఇటుగా చూస్తే ఈ సినిమా జూన్లో కూడా వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. అయితే 2023లో ప్రభాస్ నుంచి సలార్ సినిమా కూడా రావాల్సి ఉంది. ఈ సినిమా పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆదిపురుష్ వాయిదా పడుతూ ఉండడంతో సలార్ సినిమా డేట్ తో క్లాష్ అయ్యే అవకాశం కూడా ఉంది.
సినిమా సినిమాకు కాస్త ఎక్కువగా గ్యాప్ ఉండాలి అని కూడా ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. అందుకే సలార్ విషయంలో నమ్మకంగా ఉండడంతో ఆ సినిమాను ముందుగా తీసుకురావాలని అనుకుంటున్నారు. 2023 సెప్టెంబర్ 28వ న విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆదిపురుష్ జూన్ లో రాకుంటే దసరా టైమ్ కి కూడా వచ్చే అవకాశం లేదు. అప్పుడు డేట్ విషయంలో మరింత కష్టమవుతుంది. అందుకే ముందుగా సలార్ సినిమాలను విడుదల చేసిన తర్వాతనే ఆదిపురుష్ సంగతి చూడాలి అని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. మరి ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో కాలమే సమాధానం చెప్పాలి.