హ‌ను రాఘ‌వ‌పూడి ప్లాన్ బీ సిద్దం చేస్తున్న‌డా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌నురాఘ‌వ‌పూడి పీరియాడిక్ యాక్ష‌న్ చిత్రం పౌజీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-29 16:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌నురాఘ‌వ‌పూడి పీరియాడిక్ యాక్ష‌న్ చిత్రం పౌజీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ ల‌వ్ అండ్ వార్ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఏడాది కాలంగా సెట్స్ లో ఉన్న చిత్రాన్ని ఇదే ఏడాది ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇది మొద‌టి భాగం. దీనికి రెండివ భాగం కూడా ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి. కానీ రెండ‌వ భాగం ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది మొద‌టి భాగం స‌క్సెస్ పై ఆధార‌ప‌డి ఉంటుంది. పార్ట్ వ‌న్ భారీ విజ‌యం సాధిస్తేనే రెండవ భాగం తీస్తారు. లేదంటే సైలెంట్ అయిపోతారు.

కానీ ఏ సినిమా హిట్ అయ్యే వ‌ర‌కూ గ్యారెంటీ చెప్ప‌లేం. ఈ నేప‌థ్యంలో హ‌ను రాఘ‌వ‌పూడి ప్లాన్ బీ కూడా సిద్దం చేసుకుంటున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. హను రాఘవపూడి కెరీర్‌ గ్యాప్ రాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ బిని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలయ్యాక దర్శకులు తదుపరి ప్రాజెక్టు కోసం చాలా సమయం తీసుకుంటారు. కానీ హను మాత్రం సమయాన్ని వృధా చేయకుండా ఫౌజీ ఫలితంతో సంబంధం లేకుండా తన తదుపరి స్క్రిప్ట్‌ను ఇప్పుడే లాక్ చేసుకుంటున్నారని సమాచారం.

ఈ ప్లాన్ బి కేవలం కథకు మాత్రమే పరిమితం కాలేదు. ఒక యువ హీరోను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం లైన్‌లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీతారామం వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను శైలిపై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఏర్పడింది. అందుకే అగ్ర హీరోల కాల్ షీట్స్ కోసం వేచి చూడకుండా కంటెంట్ నమ్ముకుని ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. హను రాఘవపూడి సినిమాల్లో విజువల్స్ , ఎమోషన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఫౌజీ వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత ప్లాన్ బి కింద ఆయన సిద్ధం చేసే కథ కొంచెం తక్కువ రిస్క్‌తో కూడినదై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలా ముందే సిద్ధంగా ఉండటం వల్ల నిర్మాతలకు కూడా భరోసా ఉంటుంది. దర్శకుడిగా హ‌ను రాఘ‌వ‌పూడి క్రేజ్ కూడా తగ్గకుండా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు. సినిమా రంగంలో అనిశ్చితి ఎక్కువ కాబట్టి సక్సెస్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టడం తెలివైన పని. హను కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తూ తన స్క్రిప్ట్ వర్క్‌ను వేగ వంతం చేశాడు. ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే ఖాళీ సమయాల్లో తన ప్లాన్ బి కథను మెరుగు పరుస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రి ఇందులో ఏ హీరో న‌టిస్తాడో చూడాలి. ఒక వేళ పౌజీ స‌క్సెస్ అయితే ప్లాన్ బీని తాత్కాలికంగా ప‌క్క‌న బెట్టి `ఫౌజీ 2`పై ప‌ని చేస్తాడు.

Tags:    

Similar News