దశాబ్దం తర్వాత మళ్లీ ఆ జోడీ!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే.;
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. `వీరసింహారెడ్డి` వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో? అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి నటిస్తోంది. దీంతో ఈజోడీని బాబి ఎలా ఆవిష్కరిస్తాడు? ఎంత అందంగా చూపిస్తాడు? అన్నది చర్చగా మారింది. అలాగే మరో కీలక పాత్రకు పూజాహెగ్డేను కూడా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇది కేవలం అతిథి పాత్ర మాత్రమే కాకుండా? కథను మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన పాత్ర అని వార్తలొస్తున్నాయి. ఆమె ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని, సినిమా గమనాన్ని మార్చే స్థాయిలో ఆమె క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో బాలకృష్ణ- రాయ్ లక్ష్మీ కలయికలో `అధినాయకుడు` అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మరే సినిమాలను కలిసి నటించలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అప్పట్లో ఈ జోడీకి మంచి మార్కులే పడ్డాయి. పోటా పోటీగా నటించారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎంతో రక్తి కట్టించాయి. అదే నమ్మకంతో గోపీచంద్ మలినేని ఈ కాంబోని సెట్ చేస్తున్నట్లు కని పిస్తుంది. గోపీచంద్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ సినిమాలో కూడా రాయ్ లక్ష్మీ పాత్రను కేవలం గ్లామర్ కోసమే కాకుండా? నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్‌గా మలిచే అవకాశం ఉంది.
లక్ష్మీ రాయ్ పాత్రకు సంబంధించి త్వరలో లుక్ టెస్ట్ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగు తున్నాయి. నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి వీలైనం తర్వగా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని రెడీ అవుతున్నారు. బాలయ్య గత సినిమా `అఖండ2` పాన్ ఇండియాలో రిలీజ్ అయినా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో బాలయ్య సక్సెస్ కొట్టాలనే కసి మీద ఉన్నారు.షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసి ఇదే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో ఇదే ఏడాది తనయుడిని లాంచ్ చేయలని చూస్తున్నారు.