'సమ్మర్ హాలీడేస్'లో రోహనా? అనురాగ్?.. కొత్త ప్రోమో హైప్ పెంచేలా..
పిల్లల ప్రపంచాన్ని, చిన్ననాటి మెమోరీస్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు సిద్ధమవుతున్న సమ్మర్ హాలీడేస్ సినిమా నుంచి తొలి సింగిల్ అప్డేట్ వచ్చింది.
పిల్లల ప్రపంచాన్ని, చిన్ననాటి మెమోరీస్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు సిద్ధమవుతున్న సమ్మర్ హాలీడేస్ సినిమా నుంచి తొలి సింగిల్ అప్డేట్ వచ్చింది. మూవీ ఫస్ట్ సింగిల్ క్రష్ పాటను జూలై 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ సమయంలో విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో చూపించిన ఫన్నీ కన్వర్జేషన్, చివర్లో వినిపించిన మెలోడీ ట్యూన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రోమో స్ట్రార్టింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమిల్లి పాట కంపోజ్ చేసే పనిలో ఉంటారు. అదే సమయంలో యాక్టర్ రోహన్ వచ్చి.. "ఈ పాట నేను పాడుతా" అంటూ సరదాగా అడుగుతాడు. ఆ తర్వాత తనదైన స్టైల్లో పాట పాడేందుకు ప్రయత్నించడం నవ్వులు పంచుతుంది. అయితే వెంటనే సింగర్ అనురాగ్ కులకర్ణి రంగంలోకి దిగడంతో అసలు పాట ఎలా ఉండబోతుందో చిన్న గ్లింప్స్ ద్వారా చూపించారు.
"ఓ తుర్రుమన్న పాలపిట్ట..." అంటూ వినిపించిన మెలోడీ ట్యూన్ చాలా హాయిగా అనిపిస్తోంది. కేవలం కొన్ని సెకన్లే ఉన్నా.. సాంగ్ లోని ఫీల్, మ్యూజిక్, అనురాగ్ వాయిస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఫస్ట్ సింగిల్ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. కంప్లీట్ సాంగ్ విడుదలైన తర్వాత చార్ట్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా అదే ఆసక్తిని మరింత పెంచింది. చిన్ననాటి సమ్మర్ హాలీడేస్, ఫ్రెండ్ షిప్స్, గేమ్స్, ఫన్నీ మెమోరీస్ ను సినిమాలో మెయిన్ గా చూపించబోతున్నట్లు టీజర్, పోస్టర్ల ద్వారా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మ్యూజిక్ కూడా సినిమాకు మరో మెయిన్ అట్రాక్షన్ లా మారేలా కనిపిస్తోంది.
ఇక సినిమాను శ్రీకర్ నాయన్ తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, వీజీబీ ఫిలిమ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తనకంటూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని సమ్మర్ హాలీడేస్ సినిమాను కూడా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు. సినిమాలో రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. వీరితో పాటు జయసుధ, వాసుకీ ఆనంద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, రమణ భార్గవ్, హర్షిణి కొడూరి, మహేష్ చింతల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే 90స్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న రోహన్ సినిమాలో మరోసారి ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 35 చిన్న కథ కాదు సినిమాతో మంచి పేరు సంపాదించిన అరుణ్ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక జూలై 1న విడుదల కానున్న క్రష్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందా? అనేది అంతా వేచి చూడాలి.