• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవ‌ర‌కొండ‌ ప్రేమను ...

దేవ‌ర‌కొండ‌ ప్రేమను క‌ళ్ల‌లోనే చూస్తోన్న ర‌ష్మిక‌

| విజయ్ దేవరకొండలో తనకు బాగా నచ్చేది ఆయన చూపించే లోతైన ప్రేమేనని రష్మిక మందన్న తెలిపారు. తమ బంధానికి పరస్పర అవగాహన, నమ్మకమే పునాదులని చెప్పారు. మరోవైపు రష్మిక నటించిన ‘మైసా’ ఈ నెల 27న ఐదు భాషల్లో విడుదల కానుంది.

By - Srikanth Kontham
Update: 2026-11-23 04:56 GMT

ప్రేమంటే మాటల్లో చెప్పేది కాదు. కళ్లలోకి చూస్తే అర్థమయ్యే అందమైన భావం అంటారు. సరిగ్గా ఇదే మాటను నిజం చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న . భర్త విజయ్ దేవరకొండపై ఉన్న అపారమైన ప్రేమను బయటపెట్టారు. పెళ్లయిన తర్వాత ఈ జంటపై నెట్టింట జరిగిన రచ్చ.. విమర్శల నేపథ్యంలో రష్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. భర్త ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేకంగా మాటలు అవసరం లేదని అది కళ్లముందే స్పష్టంగా కనిపిస్తుందని ఎంతో ఆత్మీయంగా చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రష్మిక వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయ్‌లో మీకు బాగా నచ్చే అలవాటు ఏంట‌ని? యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక చిరునవ్వుతో సమాధానమిచ్చారు. సాధారణంగా అందరూ నచ్చని విషయాల గురించే అడుగుతుంటారని కానీ విజయ్‌లో నచ్చే గుణాలు ఎన్నో ఉన్నాయన్నారు. ముఖ్యంగా అతనిలో లోతైన ప్రేమ తనను ఎంతగానో కట్టిపడేస్తుందని..అది పైపైకి కనిపించేది కాదని తనకు మాత్రమే అర్థమయ్యే ప్రత్యేకమైన స్థాయిలో ఉంటుందని వివరించారు.

బయటి ప్రపంచం ఎన్ని రకాలుగా విశ్లేషించినా? ఒక బంధానికి అసలైన పునాది ఇద్దరి మధ్య ఉండే పరస్పర అవగాహన.. సౌకర్యం మాత్రమేనని రష్మిక తేల్చి చెప్పారు. ఒకే కల.. ఒకే ఇల్లు పంచుకునే ప్రయాణంలో ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే నిజమైన బంధం నిలబడుతుందని అభిప్రాయపడ్డారు. పెళ్లి నాటికి అవన్నీ మాటలతో చెప్పాల్సిన పనిలేకుండానే అలవాటైపోతాయని తమ మధ్య ఉన్నది అలాంటి స్వచ్ఛమైన బంధమేనన్నారు.

మ‌రోవైపు ర‌ష్మిక‌ కెరీర్ పరంగానూ సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అమ్మ‌డు నటించిన `మైసా` సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ చిత్రంలో గోండు గిరిజన యువతిగా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ర‌ష్మిక‌ ఎంతో శ్ర‌మించింది. ఓ కీలక ఫైట్ షూట్ చేస్తున్నప్పుడు కండరం తెగి తీవ్రమైన నొప్పిని భ‌రించిన సంగ‌తి తెలిసిందే.

కొడవలితో ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. నీటి అడుగున ఫైట్స్ చేయడంతో పాటు బైక్ రైడింగ్ వంటి భారీ సాహసాలే ఉన్నాయి. ఈ నెల 27న `మైసా` పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది.

Tags:    
  • rashmikamandanna 
  • vijaydeverakonda 
  • rashmika 
  • mysaa 

Similar News

శర్వా కెరీర్‌ను మార్చే సినిమానా..

2026-11-23 04:55 GMT

కెరీర్ పోయినా తలవంచకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!

2026-11-23 04:37 GMT

మాల్దీవుల్లో నేహా శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్!

2026-11-23 04:37 GMT

ఔత్సాహిక సినీర‌చ‌యిత‌లు ఈ దిగ్గ‌జాల నుంచి నేర్చుకోవాల్సిన‌వి!

2026-11-23 04:37 GMT

స్టాక్ మార్కెట్లో IPOకి వెళుతున్న అగ్ర నిర్మాణ సంస్థ?

2026-11-23 03:59 GMT

నిర్మాత ఆఫీస్‌కి వేరొక క‌థ విన‌డానికి వెళ్లి అలా లాక్ అయిపోయింద‌ట‌

2026-11-23 03:56 GMT

భోగి వేదిక‌కు కొత్త‌ క‌ళ తెచ్చిన శ‌ర్వానంద్ సిస్ట‌ర్స్

2026-11-23 03:55 GMT

హీరో-ద‌ర్శ‌కుడి పారితోషికాల్ని బ‌డ్జెట్‌లో 25 శాతానికి కుదించాలి!

2026-11-23 02:35 GMT

దేవిశ్రీ ప్రసాద్‌ను చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు.. !

2026-11-23 02:34 GMT

టాలీవుడ్‌లో రెండే సినిమాలు చేసినా కోట్ల‌కు కోట్లు కొల్ల‌గొడుతోంది!

2026-11-23 02:32 GMT

ఆకాశంలో కొత్త సినీ వ్యాపారం.. విమాన సినిమాలకూ ఆస్కార్!

2026-11-23 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS