• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాత ఆఫీస్‌కి వేరొక...

నిర్మాత ఆఫీస్‌కి వేరొక క‌థ విన‌డానికి వెళ్లి అలా లాక్ అయిపోయింద‌ట‌

| ‘భోగి’లో మందారం పాత్ర తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని డింపుల్ హయాతి అన్నారు. ఇప్పటివరకు గ్లామర్, పాటలు, డ్యాన్స్‌లకే పరిమితమైన తనకు ఈ పాత్ర కొత్త గుర్తింపు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ యాస, పెద్ద డైలాగులు నేర్చుకోవడం సవాలుగా అనిపించిందని, నవంబర్ 27న కొత్త డింపుల్‌ను చూస్తారని చెప్పారు.

By - Sivaji Kontham
Update: 2026-11-23 03:56 GMT

శ‌ర్వానంద్ రా అండ్ ఇంటెన్స్ భోగి ట్రైల‌ర్ విడుద‌లై అంత‌ర్జాలంలో దూసుకెళుతోంది. ఈ ఈవెంట్ వేదికపై తన పాత్ర గురించి డింపుల్ హ‌యాథీ ప‌లు ఆసక్తికరమైన విషయాలను వెల్ల‌డించారు. తాను మొదట వేరే సినిమా కథ కోసం నిర్మాత రాధామోహన్ గారిని కలిశానని.. అక్కడ దర్శకుడు సంపత్ నందిని కలిసినట్లు తెలిపారు. `భోగి` కథ విని, అందులోని `మందారం` పాత్ర గురించి తెలుసుకున్న వెంటనే ఈ పాత్ర తానే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సాధారణంగా నిర్మాతలు ఇలాంటి మార్పులపై సందేహించినా.. రాధామోహన్ గారు మాత్రం ఎంతో ఓపికగా, దయతో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.

ఇప్పటివరకు ప్రేక్షకులు తనను కేవలం గ్లామర్, పాటలు, డ్యాన్స్‌లకే పరిమితమైన నటిగా చూశారని.. కానీ `మందారం` పాత్ర తనలో ఒక కొత్త కోణాన్ని, భిన్నమైన రూపాన్ని ఆవిష్కరిస్తుందని డింపుల్ చెప్పారు. తన కళ్లపై దర్శకుడు సంపత్ నంది దృష్టి పెట్టడం ఇదే తొలిసారని.. ఈ శక్తివంతమైన పాత్ర తన కెరీర్‌లో ఒక కొత్త దారిని చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు సంపత్ నందితో పనిచేయడం ఒక గొప్ప అనుభవమని.. ప్రతి సీన్‌ను విభిన్న మాడ్యులేషన్లతో ఎలా చేయాలో ప్రోత్సహించారని తెలిపారు.

తాను తెలుగు అమ్మాయి అయినా ఈ సినిమాలోని పాత తరపు తెలంగాణ యాసను నేర్చుకోవడం.. పెద్ద డైలాగులు చెప్పడం కొంచెం కష్టంగా అనిపించినా ఎంతో నేర్చుకున్నానని డింపుల్ పేర్కొన్నారు. తనను అందంగా, పవర్‌ఫుల్‌గా చూపించిన డీఓపీకి ధన్యవాదాలు తెలిపారు. ఈవెంట్‌కు రాలేకపోయిన అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించారని.. అలాగే `గంగ` పాత్రలో శర్వానంద్ ఎంతో కష్టపడ్డారని.. రా- రస్టిక్ లుక్‌లో అత‌డి నటన మరో మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు.

దర్శకుడు సంపత్ నంది కోరిన‌ట్టుగానే మట్టిలో దొర్లేంత కష్టపడి అందరూ ఈ సినిమా కోసం శ్రమించారని డింపుల్ చెప్పారు. ముఖ్యంగా ఈ చిత్రంలో తనకు డ్యాన్స్ లేదని నవంబర్ 27న విడుదలయ్యే సినిమాలో సరికొత్త డింపుల్‌ను, `మందారం`ను చూస్తారని చెప్పారు.

Tags:    
  • dimplehayathi 
  • bhogi 
  • sharwanand 
  • sampathnandi 

Similar News

స్టాక్ మార్కెట్లో IPOకి వెళుతున్న అగ్ర నిర్మాణ సంస్థ?

2026-11-23 03:59 GMT

భోగి వేదిక‌కు కొత్త‌ క‌ళ తెచ్చిన శ‌ర్వానంద్ సిస్ట‌ర్స్

2026-11-23 03:55 GMT

హీరో-ద‌ర్శ‌కుడి పారితోషికాల్ని బ‌డ్జెట్‌లో 25 శాతానికి కుదించాలి!

2026-11-23 02:35 GMT

దేవిశ్రీ ప్రసాద్‌ను చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు.. !

2026-11-23 02:34 GMT

టాలీవుడ్‌లో రెండే సినిమాలు చేసినా కోట్ల‌కు కోట్లు కొల్ల‌గొడుతోంది!

2026-11-23 02:32 GMT

ఆకాశంలో కొత్త సినీ వ్యాపారం.. విమాన సినిమాలకూ ఆస్కార్!

2026-11-23 02:30 GMT

'దురంధ‌ర్' స్థాయిలో మ‌రో స్పైవ‌ర్స్ ఆదిత్యాధ‌ర్ లేకుండా పాజిబులేనే?

2026-11-23 02:29 GMT

త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కంటే ముందు మరొకటా?

2026-11-23 02:29 GMT

ఇత‌ర షోల‌తో పోలిస్తే 'మెగావ‌ర్స్' ప్ర‌త్యేక‌త అదే!

2026-11-23 02:28 GMT

కెమెరాల మధ్య స్టేజ్‌పై ఏం జరిగింది?

2026-11-23 02:28 GMT

చిరు పేరులో ఓ అక్షరం మాయం.. అసలు కథ ఇదే!

2026-11-23 02:27 GMT

Copyright @2026

Powered by Blink CMS