టాలీవుడ్‌లో మ‌రో కొత్త సెంటిమెంట్..

ప్రస్తుతం అలాంటి ఓ ఆసక్తికరమైన పోలికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2026-06-29 12:30 GMT

టాలీవుడ్‌లో సినిమాల స‌క్సెస్ ల‌తో పాటు వాటి చుట్టూ ఏర్పడే సెంటిమెంట్లు, యాదృచ్ఛికాలు కూడా తరచూ డిస్క‌ష‌న్ కు వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ ఆసక్తికరమైన పోలికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గ్రామీణ నేపథ్య సినిమాల తర్వాత, మహిళా ప్రధాన పాత్రతో తెరకెక్కిన సినిమాలు భారీ విజయాలు సాధించాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్యాటర్న్‌లో సమంత పేరు మూడు సార్లు రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

2018లో రిలీజైన‌ రంగస్థలం రామ్ చరణ్ కెరీర్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. యాక్టింగ్ పరంగా చ‌ర‌ణ్ కు ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఇది అగ్రస్థానంలో నిలిచింది. ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా క‌నిపించి ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంది. రంగస్థలం రిలీజైన కొన్ని వారాలకే రిలీజైన మహానటి సినిమాలో సమంత జర్నలిస్టు పాత్ర పోషించగా, నేష‌న‌ల్ లెవెల్ లో ఆ సినిమా సంచలనం సృష్టించింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా అవార్డుల పరంగా కూడా భారీ గుర్తింపును సాధించింది.

ఇప్పుడ‌దే తరహా పోలికను అభిమానులు పెద్ది మరియు మా ఇంటి బంగారం సినిమాలకు కూడా అన్వయిస్తున్నారు. పెద్ది ఇప్పటికే భారీ అంచనాలతో పాటు అవార్డు విన్నింగ్ కాంప్లిమెంట్స్ అందుకునే రూర‌ల్ విలేజ్ డ్రామాగా నిలుస్తుందనే డిస్క‌ష‌న్ జరుగుతుండగా, ఆ సినిమా రిలీజైన లేడీ ఓరియెంటెడ్ మూవీ మా ఇంటి బంగారం కూడా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించ‌డం, ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిల‌వ‌డం వ‌ల్ల గతంలో కనిపించిన ప్యాటర్న్ మరోసారి రిపీట్ అయింద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

ఈ నాలుగు సినిమాల‌నూ పరిశీలిస్తే మరో ఆసక్తికర అంశం కూడా కనిపిస్తుంది. రంగస్థలం, మహానటి, మా ఇంటి బంగారం... ఈ మూడు ప్రాజెక్టుల్లోనూ సమంత కీలకంగా ఉండటం విశేషం. రంగస్థలంలో హీరోయిన్ గా, మహానటిలో ముఖ్యమైన కీల‌క‌ పాత్రలో, ఇప్పుడు మా ఇంటి బంగారంలో పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో ఆమె క‌నిపించింది. అందుకే ఈ మొత్తం డిస్క‌ష‌న్ లో సమంతనే కామన్ ఫ్యాక్టర్‌గా అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో అభిమానులు గుర్తించిన యాదృచ్ఛిక పోలికలు మాత్రమే. ఒక సినిమా స‌క్సెస్ మరో సినిమాను డిసైడ్ చేయ‌ద‌నేది నిజం. కథ, డైరెక్ష‌న్, నటీనటుల పెర్ఫార్మెన్స్, రిలీజ్ టైమ్ వంటి అనేక అంశాలే సినిమా రిజ‌ల్ట్ ను డిసైడ్ చేస్తాయి. అయినప్పటికీ రామ్ చరణ్ కెరీర్‌లోని కీలక మైలురాళ్ల తర్వాత సమంత కెరీర్‌లో కూడా గుర్తుండిపోయే ప్రాజెక్టులు రావడం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News