మెగాస్టార్-బాబి ముహూర్తం పెట్టేసారా?
మెగాస్టార్ చిరంజీవి - మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.;
మెగాస్టార్ చిరంజీవి - మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రిలీజ్ అయిన `వాల్తేరు వీరయ్య` ఏ స్థాయి విజయాన్ని అందుకుందో తెలిసిందే. తాజాగా మెగాస్టార్ 158వ చిత్రం కూడా బాబితో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. అయితే ఈ చిత్రం ఇంత వరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. చిరంజీవి రకరకాల పనులతో బిజీగా ఉండటంతో? వీలు పడలేదు. ఇప్పుడా పనులన్నీ ఓ కొలిక్కి రావడంతో రెగ్యులర్ షూటింగ్‌ను ఏప్రిల్ 20వ తేదీ నుండి ప్రారంభించేందుకు యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఓ హీరోయిన్ గా ప్రియమణిని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. మరో హీరోయిన్ కోసం కూడా సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ చేయడం ఏ దర్శకుడికైనా భారంగా మారుతోంది. 60 ఏళ్లు దాటిన హీరోలు కావడంతో 35 ఏళ్లు దాటిన హీరోయిన్లు అయితేనే వాళ్లతో సరితూగుతారు. అందులోనూ ఫాంలో ఉన్న భామల్ని వెతికి పట్టుకోవాలి. వాస్తవానికి ప్రియమణి మంచి పెర్పార్మర్ అయినప్పటికీ అమ్మడు ఫాంని ఎప్పుడో కోల్పోయింది.
హీరోయిన్ గా అవకాశాలే రావడం లేదు. అయినప్పటికీ పెర్పార్మర్ కావడం సహా వయసు సహకరిచండంతో? హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండవ నాయిక విషయంలోనే ఇవే రూల్స్ వర్తిస్తాయి. అలాగే ఇతర కీలక పాత్రల కోసం టాలీవుడ్ , కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులను సంప్రదిస్తున్నారు. ఈ చిత్రం బాబి స్టైల్ పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని టాక్.`వాల్తేరు వీరయ్య`లో చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్‌లో చూపించిన బాబీ ఈసారి అంతకు మించిన ఎనర్జీతో మెగాస్టార్‌ను ప్రెజెంట్ చేయబోతున్నారుట.
పవర్‌ఫుల్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో మెగా మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో పుష్కలంగా ఉండబోతోంది. సాంకేతికంగానూ సినిమా రిచ్‌గా ఉండబోతోందిట. అగ్ర శ్రేణి టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే సంగీత దర్శకుడిగా థమన్ ఎంపికయ్యారు. మిగతా టెక్నీషియన్ల వివరాలు బయటకు రావాల్సి ఉంది. అలాగే చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ `విశ్వంభర` కూడా సమ్మర్ లో రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. రిలీజ్ సమయం ఆసన్నమైతే? ఆసినిమాకు సంబంధించిన ప్రచారం పనుల్లో చిరు పాల్గొనాల్సి ఉంటుంది.