23 కేజీలు తగ్గిన నయా స్టార్!
వెండి తెరపై పాత్రను పండిచడం కోసం హీరోలు ఎంతగా శ్రమిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఎంత రియలిస్టిక్ గా కనిపిస్తే? అంత మంచి ఫలితాలు సాధించొచ్చు అన్న నమ్మకంతో హీరోలు ఎక్కడా రాజీ పడటం లేదు.;
వెండి తెరపై పాత్రను పండిచడం కోసం హీరోలు ఎంతగా శ్రమిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఎంత రియలిస్టిక్ గా కనిపిస్తే? అంత మంచి ఫలితాలు సాధించొచ్చు అన్న నమ్మకంతో హీరోలు ఎక్కడా రాజీ పడటం లేదు. దర్శకుడు విజన్ మేరకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ ప్రోసస్ లో ఇష్టమైన వాటిని సైతం త్యాగం చేస్తున్నారు. తాజాగా `బైకర్` సినిమా కోసం యంగ్ హీరో శర్వానంద్ ఎంతగా శ్రమించాడు ? అన్నది వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా వరుస పరాజయాల్లో ఉన్న శర్వానంద్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసిన `నారీ నారీ నడుమ మురారీ`తో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
పండగ సీజన్ కావడం పోటీగా కొన్ని సినిమాలు ఉండటంతో? వసూళ్లు కాస్త వీక్ గా కనిపించాయి గానీ లేదంటే బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రానికి ఇంకా మంచి వసూళ్లు సాధించేది. అయినా మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంలందుకుంది. ఇప్పుడదే ఉత్సాహంతో `బైకర్` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవవుతున్నాడు. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి మోటోక్రాస్ క్రీడా నేపథ్యంలో వస్తోన్న చిత్రమిదే. ఈ సినిమా కోసం శర్వానంద్ తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ పాత్ర కోసం శర్వానంద్ ఏకంగా 23 కేజీల బరువు తగ్గాడు.
దీంతో సరికొత్త లుక్ లోకి మారాడు. ఈ విషయాన్ని దర్శకుడు రివీల్ చేసాడు. సినిమాలో శర్వానంద్ ద్విపా త్రాభినయం చేస్తున్నాడు. రెండు వేర్వేరు పాత్రలు పోషిస్తున్నాడు.18 ఏళ్ల యువకుడిగా , 50 ఏళ్ల వ్యక్తిగా రెండు వేర్వేరు వయస్సుల షేడ్స్‌లో కనిపించాల్సి ఉండటంతో శర్వానంద్ రూపురేఖలను మార్చుకోవాలని నిర్ణయిం చుకున్నాడు. ఇందుకోసం ఆయన దాదాపు 6 నెలల పాటు ఫిజిక్ పైనే దృష్టి పెట్టాడు. ప్రతిరోజూ ఉదయం నాలుగున్నర గంటలకే నిద్రలేచి కఠినమైన వ్యాయామాలు మొదలు పెట్టాడు. డైట్ విషయంలోనూ ఎంతో క్రమశిక్షణ పాటించాడు.
తాను భోజన ప్రియుడు అయినప్పటికీ నోరు కుట్టేసుకున్నాడు. పాత్ర డిమాండ్ మేరకు ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. పౌష్టికాహారంపైనే దృష్టి పెట్టాడు. ఫిట్‌నెస్‌లో 70 శాతం డైట్, 30 శాతం ట్రైనింగ్ పాత్ర ఉండేలా చూసుకున్నాడు. ఓప్రోఫెషనల్ బైకర్ గా కనిపించాలంటే ఇవన్నీ తప్పనిసరి కావడంతో ఎక్కడా రాజీ పడలేదు. ఈ వెయిట్ లాస్ జర్నీ కేవలం సినిమా కోసమే కాదు. తన కుటుంబం , ఆరోగ్యం పట్ల తనకు కొత్త దృక్పథాన్ని అందించింది. కుమార్తె పుట్టిన తర్వాత తన కుటుంబంతో ఎక్కువ కాలం గడపాలన్న బాధ్యత కూడా ఈ మార్పుకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో శర్వానంద్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు. కెరీర్ లో ఉత్తమ చిత్రంగా `బైకర్` నిలిచి పోతుందని నమ్మకంగా ఉన్నాడు. మరి ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న సినిమా ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.