బైకర్ కోసం రోజుకి 32 కి.మీ.. శర్వా డెడికేష‌న్ కు హ్యాట్సాఫ్!

బైకర్ కోసం శ‌ర్వానంద్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఆయన లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.;

Update: 2026-03-29 18:27 GMT

బైకర్ కోసం శ‌ర్వానంద్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఆయన లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, తాజాగా విడుదలైన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఈ మార్పు వెనుక ఉన్న కఠినమైన ప్రయాణాన్ని స్పష్టంగా అంద‌రికీ తెలిసేలా చేసింది. ఈ సినిమాలో బైకర్ పాత్రను రియలిస్టిక్‌గా చూపించాలన్న లక్ష్యంతో శర్వా పూర్తిగా తన శరీరాన్ని మలచుకున్నారు. ట్రైనింగ్ లో భాగంగా శ‌ర్వా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తడం లాంటి ఎక్స్‌ట్రీమ్ కార్డియో వర్కౌట్స్ చేయడ‌మ‌నేది మామూలు విషయం కాదు. క్రమశిక్షణతో చేసిన ఈ ప్రయాణంలో ఆయన 6 నుంచి 8 కిలోల వరకు బరువు తగ్గి, లీన్ మరియు యూత్‌ఫుల్ ఫిజిక్‌ను సాధించారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కేవలం లుక్ కోసమే కాకుండా, పాత్రకు న్యాయం చేయాలనే పట్టుదలతో జరిగిందిగా కనిపిస్తోంది.

అయితే, ఈ మార్పు వెనుక ఉన్న అసలు కార‌ణం డెడికేషన్‌దే. కఠినమైన వర్కౌట్స్, నిరంతర శ్రమ, మానసిక ఒత్తిడి.. వీట‌న్నింటినీ ఎదుర్కొంటూ శర్వా తన టార్గెట్ ను సాధించారు. ఈ ప్రయాణాన్ని ఆయన స్వయంగా ఎగ్జాస్టింగ్, పెయిన్‌ఫుల్, రిలెంట్‌లెస్ గా అభివర్ణించడం, ఈ ప్రిపరేషన్ ఎంత తీవ్రంగా సాగిందో చెబుతోంది. ఫిజికల్‌గా మాత్రమే కాదు, మెంటల్‌గా కూడా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఒక పెద్ద ఛాలెంజ్‌గా నిలిచింది.

ఫిట్‌నెస్ పరంగా చూస్తే, ఆయన రొటీన్ చాలా కఠినంగా ఉంది. జిమ్‌లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్‌తో పాటూ స్ట్రెచింగ్, బ్రీత్‌వర్క్‌లను కూడా పాటించారు. ముఖ్యంగా యోగా ఆయనకు మానసిక ప్రశాంతత ఇచ్చిన కీలక అంశంగా మారింది. కఠినమైన ట్రైనింగ్ వల్ల వచ్చే మెంటల్ స్ట్రెయిన్‌ను తగ్గించడంలో యోగా ముఖ్య పాత్ర పోషించిందని ఆయన చెప్పడం, ఫిట్‌నెస్‌లో మైండ్- బాడీ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

బిహైండ్ ది సీన్స్ యాంగిల్ లో చూస్తే, ఈ ప్రాజెక్ట్ కోసం చేసిన ప్రిపరేషన్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోలో కనిపించిన ట్రైనింగ్ సెషన్స్, బైక్ రైడింగ్ ప్రాక్టీస్ ఇవ‌న్నీ చూస్తుంటే శ‌ర్వా ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నేది తెలుస్తోంది. సినిమాలో ఉపయోగించే బైక్స్‌ను నడిపేందుకు స్పెష‌ల్ గా ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా, ఆయన పాత్రను మరింత సహజంగా తీర్చిదిద్దారు.

ఇది కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఒక యాక్ట‌ర్ క‌మిట్‌మెంట్ కు ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదని శర్వా చూపించారు. కాగా బైక‌ర్ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుండ‌గా, ఇప్ప‌టికే ఈ మూవీపై మంచి బ‌జ్ నెల‌కొంది. మ‌రి శ‌ర్వా ఈ సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం ఏ మేర‌కు ఫ‌లిస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News