ప్రభాస్ గూస్ బంప్స్ ఎంట్రీ!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సలార్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే కంటే ప్రభాస్ మాస్ యాక్షన్ సినిమాలో సక్సెస్ చూసి చాలా కాలం అవుతుంది. బాహుబలి తరువాత చేసిన సాహో సినిమా అంతగా ఆసక్తి కలిగించ లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ పూర్తిస్థాయిలో లవ్ స్టోరీ సినిమాగా రావడంతో ప్రేక్షకులు ఏమాత్రం సంతృప్తి చెంది లేకపోయారు.
అంతేకాకుండా ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. ఇక డార్లింగ్ తర్వాత సినిమా ఆదిపురుష్ పై పెద్దగా అంచనాలు అయితే లేవు. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ కథ లో ఇంకా కొత్తగా ఏమి చూపిస్తారు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ప్రాజెక్ట్ K గురించి పక్కన పెడితే అందరికి కూడా ఎక్కువగా సలార్ పైనే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకు రాబోతున్న ఈ యాక్షన్ హై వోల్టేజ్ సినిమా కాబట్టి విజువల్ ఫీస్ట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారుతుంది. ప్రభాస్ ఎంట్రీ సీన్ తోనే సలార్ లో ఒక్కసారిగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాడట. ప్రభాస్ మొదట్లో ఒక భారీ లోయలో పడిపోతాడట. ఇక ఆ తర్వాత కొన్ని చేజింగ్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ లోయ నుంచి ప్రభాస్ కొన్ని ప్రమాదాలను దాటుకుంటూ చాలా తెలివిగా బయటపడతాడు అని తెలుస్తోంది.
ఆ సన్నివేశం కోసం చిత్ర యూనిట్ సభ్యులు చాలా హార్డ్ వర్క్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రీ క్లయిమ్యాక్స్ యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమా మొత్తంలో చాలా హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. ఆ క్లైమాక్స్ సన్నివేశాలు కోసమే దాదాపు 25 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. మరి సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.