హీరోలకు ఆ అవకాశం ఉండదు : ప్రభాస్‌

Update: 2019-01-01 16:41 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు పార్ట్‌ లు కూడా భారీ విజయాలను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం కోసం ప్రభాస్‌ ఏకంగా అయిదు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. ఆ కాలంలో ‘బాహుబలి’ తప్ప మరే సినిమాకు కమిట్‌ అవ్వలేదు. ఒక హీరో అయిదు సంవత్సరాల కాలంను ఒక్క సినిమాకు కేటాయించడం మామూలు విషయం కాదు. రాజమౌళిపై నమ్మకంతో తాను అంతగా డేట్లు కేటాయించినట్లుగా ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

తాజాగా ప్రభాస్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక సినిమా కోసం అయిదు సంవత్సరాల కేటాయించడం ఏ హీరోకు కూడా సాధ్యం కాదు. కాని నేను రాజమౌళిలో తపన చూసి అంతగా డేట్లు కేటాయించాను. రాజమౌళిని నమ్మేవారు పిచొళ్లు. సినిమా పిచ్చోళ్లు మాత్రమే రాజమౌళిని నమ్ముతారు. దర్శకులు 80 - 90 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా దర్శకత్వం చేయవచ్చు. కాని హీరోలు మాత్రం అప్పటి వరకు హీరోలుగా నటించలేరు. అయిదు పదుల వయసు వచ్చిందంటే హీరోగా చేయడం కష్టం. అందుకే అయిదు సంవత్సరాల పాటు ఒకే సినిమాకు కేటాయించడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు.

ఒక సినిమా కోసం నాలుగు - అయిదు సంవత్సరాల పాటు కష్టపడితే ఆ సినిమా సక్సెస్‌ అయ్యేది, కానిది చెప్పలేం. ఐదేళ్ల పాటు సినిమా చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని ప్రభాస్‌ అన్నాడు. బాహుబలి వర్కౌట్‌ అయ్యింది కనుక పర్వాలేదు, కాని అన్ని కూడా అలా వర్కౌట్‌ అవుతాయనే నమ్మకం లేదు. అందుకే ఇకపై సంవత్సరంలో ఒకటి రెండు సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ మరో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.



Full View

Tags:    

Similar News