• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ ఫ్యాన్స్ ను...

ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న 'రాధేశ్యామ్' టీజర్!

By - Tupaki Desk
Update: 2021-10-24 12:30 GMT
ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో జనవరి 14వ తేదీన విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం, అభిమానులంతా చాలా రోజులుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బర్త్ డే కానుకగా నిన్న ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ఎంతో ఆసక్తితో ఈ టీజర్ కోసం వెయిట్  చేస్తూ వచ్చిన అభిమానులే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అందుకు కారణం ఈ టీజర్ .. సాధారణమైన ప్రేక్షకులకు అర్థమయ్యేలా లేకపోవడమే. ఈ టీజర్ చూసిన ఎవరికీ కూడా ఇది మన తెలుగు సినిమా అనిపించదు. ప్రభాస్ చేసిన హాలీవుడ్ సినిమాను తెలుగులోకి అనువాదం చేస్తున్నారేమోననే అనుభూతి కలుగుతుంది. ప్రభాస్ లుక్ .. ఆయన ఉన్న వాతావరణం ..  కిటికీలో నుంచి కనిపించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అంతా కూడా తెలుగుదనం లోపించే కనిపిస్తాయి. తెలుగు సీజీతో సహా తెలుగుదనం లోపించే కనిపిస్తుంది. ఇది ప్రభాస్ ఇమేజ్ కి పూర్తిభిన్నంగా ఉండే కథలాగుందే అనిపిస్తుంది.

ఈ టీజర్ అంతా కూడా ప్రభాస్ పైనే నడుస్తుంది .. అయితే ప్రభాస్ ఏం చెబుతున్నాడు? దేని గురించి చెబుతున్నాడు? ఆయన పాత్ర స్వరూప స్వభావాలు ఎలాంటివి? అనే విషయాలు మాత్రం సాధారణమైన ప్రేక్షకులకు ఎంతమాత్రం అర్థం కాలేదు. అలా అని చెప్పేసి మిగతా వాళ్లందరికీ పూర్తిగా అర్థమైందని కూడా చెప్పలేం. విజువల్ గా తెరపై అద్భుతాలు ఆవిష్కరించవచ్చు .. కానీ అవన్నీ కథకు లోబడే జరగాలి. గాలిపటం ఆకాశంలోనే ఎగురుతుంది .. కానీ దానిని ఎగరేసినవాడు నేలపైనే ఉంటాడు. గాలిపటానికి .. మనిషికి మధ్య ఉన్న దారం .. ఆధారంగా ఉంటుంది. అలాగే ఏ  కథ అయినా స్థానికతను ఆధారంగా చేసుకునే నడవాలి.

పాన్ ఇండియా సినిమాలు ఇలాగే ఉంటాయి .. అందరినీ దృష్టిలో పెట్టుకునే కథలు తయారవుతాయి అని సర్ది  చెప్పుకోవచ్చు. అదే సమయంలో .. ఇక్కడి ప్రేక్షకులలో ఆ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉంది? తాము చెప్పదల్చుకున్న కథ ఎంతవరకూ వాళ్లకు చేరుతుంది? అనేది దృష్టిలో పెట్టుకోవడం కూడా అంతే అవసరం. కథావస్తువు ఎంత ఖరీదైనదైనా .. బరువైనదైనా .. భారమైనదైనా అది తేలికగా చెప్పినప్పుడే దాని పూర్తి ప్రయోజనం నెరవేరుతుంది. ఇప్పుడు ఈ విషయంలోనే ప్రభాస్ అభిమానులంతా టెన్షన్ పడుతున్నారు. పాన్ ఇండియా పేరుతో తమ హీరో తెలుగు నేటివిటీకి దూరంగా వెళ్లకూడదనే కోరుకుంటున్నారు.   
Tags:    
  • RadheShyamTeaserRecords 
  • Vikramaditya 
  • HappyBirthdayPrabhas 
  • Prabhas 
  • GlobalPrabhasDay 
  • RadheShyamTeaser 
  • DilSeDarling 
  • HBDPrabhas 
  • Radheshyam 
  • prabhas fans 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS