• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇదేం టైటిల్ బాసూ అంటున్న...

ఇదేం టైటిల్ బాసూ అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

By - Tupaki Desk
Update: 2021-10-08 04:30 GMT
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. ఆయన ప్రతి కదలిక .. ప్రతి మాట ఇప్పుడు ప్రత్యేకమైపోయింది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు .. వేలకోట్లలలో బిజినెస్ లు. తన సినిమా గురించి తానే మాట్లాడలేనంత బిజీ. అయినా ఆయన నుంచి వచ్చే కొత్త ఎనౌన్స్ మెంట్లు ఆగడం లేదు. మూడు పాన్ ఇండియా సినిమాలు లైన్లో ఉండగా, ఆయన నాలుగో సినిమాకి సంబంధించిన ప్రకటన రావడంతో, ఇదెక్కడి స్పీడ్ గురూ అనేసున్నారు ఆయన అభిమానులంతా. 'మనం గ్రౌండ్ లోకి దిగితే ఇలాగే ఉంటుంది' అన్నట్టుగా ఆయన తన పని తాను చేసుకుపోతున్నాడు.

ప్రభాస్  తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరి జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సెట్స్ పై 'సలార్' .. 'ఆది పురుష్' ఉన్నాయి. ఈ రెండూ కూడా కంటెంట్ పరంగా .. ఖర్చు పరంగా మామూలు సినిమాలు కాదు. ఇక ఆ తరువాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ చేయనున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు .. అంతకు మించి అని నాగ్ అశ్విన్ చెప్పడాన్ని బట్టి ఈ ప్రాజెక్టు స్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఈ క్రేజ్ చూసి బాలీవుడ్ హీరోలు భయపడిపోతుంటే, వాళ్లని మరింత కంగారు పెట్టేస్తూ నిన్న మరో ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన ప్రకటన అది. ఈ సినిమాకి సందీప్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. టీ సిరీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా, యూవీ క్రియేషన్స్ వారు .. సందీప్ రెడ్డి వంగా భాగస్వాములుగా ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. ఈ సినిమా టైటిల్ 'స్పిరిట్' అనగానే అభిమానులు ఉలిక్కిపడ్డారు. 'ఇదెక్కడి టైటిల్ బాసూ!' అనుకుంటూ నివ్వెరపోయి .. నిర్ఘాంతపోయి .. కొయ్యబారిపోయారు. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ కి తగిన పవర్ ఈ టైటిల్లో కనిపించడం లేదనేది వారి అసంతృప్తికి కారణం.

'సాహో' సినిమా విడుదలైన తరువాత రిజల్ట్ సంగతి పక్కన పెడితే, టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేసింది. ప్రభాస్ అభిమానులను ఒక ఊపు ఊపేసింది. ఒక ఇప్పుడు సెట్స్ పై ఉన్న 'సలార్' టైటిల్ ఆ సినిమాలో ఆయన లుక్ కి తగినట్టుగా చాలా రఫ్ గా ఉంది. ఆ టైటిల్ జనానికి ఒక రేంజ్ లో ఎక్కేసింది. ఇక 'ఆది పురుష్' అనే టైటిల్ కూడా చాలా పవర్ఫుల్ టైటిల్ .. పాన్ ఇండియా సినిమా అనిపించతగిన టైటిల్. ఇలా ఒకదానికి మించి ఒకటిగా టైటిల్స్ తోనే ఆకట్టుకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నిన్న 'స్పిరిట్' టైటిల్ ను ప్రకటించారు.

'స్పిరిట్' అనేది మద్యానికి సంబంధించినదై ఉండొచ్చు .. ఇది మద్యం నేపథ్యంలో సాగే కథ కావొచ్చు .. డ్రగ్స్ ప్రధానంగా సాగే డ్రామా కావొచ్చు. కానీ 'స్పిరిట్' అనేది ఒక సినిమా టైటిల్ లా అనిపించడం లేదనేది అభిమానుల మాట. అలా అని చెప్పేసి అసలు 'స్పిరిట్' అనేది టైటిల్ కి పనికి రాదని కాదు, అది క్రేజ్ పరంగా ప్రభాస్ వెయిట్ కి తగినది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కథ ఒక అద్భుతమనీ .. ఇలాంటి పాత్రలో తనని చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారనీ .. ఈ సినిమా షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అనే ఆత్రుతతో తాను ఉన్నానని ప్రభాస్ చెప్పడంతో అభిమానుల్లో ఉత్సాహం ఎగసి పడుతోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ తో ఈ టైటిల్ సంగతిని వాళ్లు పెద్దగా పట్టించుకోకపోవచ్చునేమో.           
Tags:    
  • Prabhas25 
  • Prabhas25 update 
  • Prabhas25 shooting Sandeep Reddy Vanga 
  • Sandeep Reddy Vanga movies 
  • Radhe Shyam 
  • Salaar 
  • Adipurush 
  • Prabhas Fans 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS