`ఓం 3డి` తర్వాత `ధూమ్ 4`ని అనౌన్స్ చేస్తాడా?
ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చి ఇటీవల హైదరాబాద్ లో రాధే శ్యామ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. ఇటలీలో రెండు రోజుల విరామం సమయంలో అక్కడ వీధుల్లో విహరించి అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు ప్రభాస్. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఈ వారాంతంలో డార్లింగ్ ముంబైకి వెళ్తాడు. ఆదిపురుష్ 3డి పనుల్ని సమీక్షిస్తాడట. ఓం రౌత్ బౌండ్ స్క్రిప్ట్ తో నేడు ప్రభాస్ ను కలుస్తారు. టి-సిరీస్ అధినేతలు కూడా కలుస్తారు. ఈ కలయికలో స్క్రిప్టును ఫైనల్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
`ఓంరౌత్ 3డి` మూవీ సహా పలువురు హిందీ దర్శకులు వినిపించే కథల్ని ప్రభాస్ వినేందుకు ఆస్కారం ఉందట. ఇక డార్లింగ్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న యష్ రాజ్ సంస్థ `ధూమ్ 4` కోసం తనని సంప్రదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పలువురు దర్శకనిర్మాతలు ప్రభాస్ ని రౌండప్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ముంబైలో బిజీ వీకెండ్ అనంతరం.. సోమవారం నుండి గి రాధే శ్యామ్ సెట్స్ కు తిరిగి వస్తాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన రాధే శ్యామ్ వేసవిలో విడుదల కానుంది. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది. తదుపరి నాగ్ అశ్విన్ మూవీ గురించి కూడా అప్ డేట్ తెలియాల్సి ఉంది.