2022లో వస్తానంటున్న పాన్ ఇండియా సూపర్ హీరో!

Update: 2020-05-07 13:30 GMT
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమాకోసం అభిమానులు కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ప్రభాస్ తో చేసే సినిమాలు భారీ బడ్జెట్ లోనే ఉంటున్నాయి. సాహో తర్వాత ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆల్రెడీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడట.

సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ భారీ లెవెల్లో ఉంటుంది. అందుకే విఎఫ్ఎక్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టనున్నాడట నిర్మాత అశ్వినీదత్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుందనీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా విడుదల గురించి నిర్మాత అశ్వినిదత్ పెదవి విప్పారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ నుండి ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లి వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లో మూవీని రిలీజ్ చేయాల‌ని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమాని 2022 ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. భారీ బ‌డ్జెట్‌ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News