పెళ్లిలో జంటగా ప్రభాస్‌ - అనుష్క.. మళ్లీ మొదలు

Update: 2018-12-31 05:48 GMT
చాలా కాలంగా అనుష్క మరియు ప్రభాస్‌ లమద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు - పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు మీడియాలో వస్తున్న వార్తలను వారిద్దరు కూడా కొట్టి పారేస్తూ వచ్చారు. తాము మంచి స్నేహితులం అంటూ చెబుతూ ఉన్నారు. వారిద్దరు ఎంతగా ప్రేమ విషయాన్ని కొట్టి పారేస్తున్నారో, అంతే ఇదిగా మళ్లీ వార్తలు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా వీరిద్దరు రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో ఎంతో మంది సెలబ్రెటీలు పాల్గొన్నారు. కాని ఎక్కువగా వీరిద్దరిపై ఫోకస్‌ పెట్టారు. ప్రభాస్‌ అనుష్క పెళ్లి వేడుకలో ఎప్పుడు ఒకే చోట కనిపించడంతో పాటు, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఇద్దరు కలిసి పాల్గొన్నారు. పెళ్లి సమయంలో స్టేజ్‌ పై వీరిద్దరు కలిసి నిల్చున్నారు. వీరి జంట కొత్తగా పెళ్లైన వారు ఉన్నట్లుగా అనిపించిందంటూ సోషల్‌ మీడియా టాక్‌ వినిపిస్తుంది.

కార్తికేయ వివాహంలో వీరిద్దరు కలిసి ఉన్న ఒక చిన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోతో మళ్లీ మీడియాలో వార్తల్లోకి ఎక్కారు. ఇద్దరి మద్య ప్రేమ లేకుండానే ఇంత క్లోజ్‌ గా ఉంటారా అంటూ మళ్లీ పుకార్లు మొదలు అయ్యాయి. స్నేహితులం అంటూ చెప్పుకుంటున్న వీరిద్దరు చాలా క్లోజ్‌ గా మెలుగుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకసారి ప్రేమించుకుంటున్నాం - పెళ్లి చేసుకోబోతున్నాం అనే ప్రకటన వస్తుందేమో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Full View

Tags:    

Similar News