ఒక కథ ఓకే చెయ్యడానికి మూడేళ్లా?

Update: 2015-09-01 09:19 GMT
బుల్లితెర మెగాస్టార్ అంటూ ఈటీవీలో తెగ సందడి చేసేసిన ప్రభాకర్... ఇప్పుడు ఫిలిం డైరెక్టర్ గా మారబోతున్నాడు. యాహూ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన ప్రభాకర్... తర్వాత ఈటీవీలో చెలరేగిపోయాడు. సీరియల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్.. ఇలా ఏ కార్యక్రమంలో అయినా సరే ఈ బుల్లిమెగాస్టార్ రచ్చ ఓ రేంజ్ లో ఉండేది. తర్వాత మారిన పరిస్థితులతో సీరియల్స్ లో సీనియర్ కేరక్టర్లు పోషిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.

కానీ ఇతగాడికి డైరెక్టర్ అయిపోవాలని ఎప్పటినుంచే డ్రీం ఉంది. దీనికోసం బాగానే కష్టపడ్డాడు. స్క్రిప్ట్ కూడా రెడీ చేసేసుకుని చాలామందిని ట్రై చేశాడు. ఇఫ్పటివరకూ పెద్దగా ప్రయోజనం లేదు కానీ... ఇప్పుడు మాత్రం టైం కలిసొచ్చినట్లైంది. గీతా ఆర్ట్స్ 2 అంటూ అల్లు అరవింద్ లోబడ్జెట్ మూవీల కోసం ప్రత్యేకమైన బ్యానర్ ప్రారంభించారు. దీని ద్వారా కొత్త ట్యాలంట్ ను ప్రోత్సహించాలన్నది ఆయన ఐడియా. ఇప్పుడు నాని హీరోగా వస్తున్న భలేభలే మగాడివోయ్.. ఈ బ్యానర్ వస్తున్న మొదటి మూవీ. దీనికి ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో.

దీంతో ఈ బ్యానర్ పై రెండు కొత్త సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకదానిలో రాజ్ తరుణ్ హీరోకాగా.. మరోదానికి డైరెక్టర్ గా ప్రభాకర్ కి ఛాన్స్ వచ్చిందట. మూడేళ్ల నుంచి ఈ స్క్రిప్ట్ ను పట్టాలెక్కించుదుకు ప్రయత్నిస్తే... ఇప్పటికి అరవింద్ ఓకే చేశారని తెలుస్తోంది. ఒక స్క్రిప్ట్ కు మూడేళ్లు పట్టిందంటే... ఈ క్యాంప్ లోకి వచ్చాక మార్పులు చేయడానికే అర్ధం చేసుకోవాలి. ఇంతకీ ప్రభాకర్ దగ్గర తొలి కాపీ ఉంటే ఓసారి చూసుకుంటే... అసలు తాను అనుకున్న లైన్, స్క్రిప్ట్ అదేనో కాదో ఐడియా వస్తుందేమో. ఎందుకంటే.. ఈ క్యాంప్ లోకి ఎంటర్ అవాలంటే... వాళ్లు చెప్పిన మార్పులన్నీ చేయాల్సిందే కదా.. అంటున్నారు అసిస్టెంట్‌ డైరక్టర్లు!!


Tags:    

Similar News