• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ రెండిటి కలయికే ఆచార్య:...

ఆ రెండిటి కలయికే ఆచార్య: కొరటాల శివ

By - Tupaki Desk
Update: 2020-05-01 11:51 GMT
వందశాతం సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ కొత్త సినిమా చేస్తున్నారంటే ఆ ప్రాజెక్టుపై ఆటోమేటిక్ గా భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే చెప్పేదేముంది? అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య' అందుకే క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయింది. కరోనా క్రైసిస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ విరమణ తర్వాత ఎప్పుడు షూటింగులకు అనుమతి లభిస్తుందో అప్పుడు వెంటనే 'ఆచార్య' మళ్లీ పట్టాలెక్కుతుంది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి దర్శకుడు కొరటాల శివ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఈ సినిమా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తే ఈ సినిమా తన పంథా అయిన సామాజిక అంశాలతో కూడా ఎంటర్టైన్మెంట్.. చిరంజీవి గారి మాస్ ఇమేజ్ ను కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ కోసం ఒక పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేశానని.. ఆ పాత్ర ప్రేక్షకులపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని తెలిపారు.

ఈ సినిమాలో చిరంజీవి ప్రొఫెసర్ గా మారిన నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవి సరసన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • acharya 
  • chiranjeevi 
  • koratala siva 
  • powerful role for chiru in acharya 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS