శృతి వైపే మొగ్గిన వకీల్‌ సాబ్‌

Update: 2020-03-20 08:30 GMT
బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’ రీమేక్‌ తో పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ రీమేక్‌ షూటింగ్‌ సగానికి పైగా పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవలై వకీల్‌ సాబ్‌ అంటూ ఈ సినిమాకు టైటిల్‌ ను ఖరారు చేసి ఫస్ట్‌ లుక్‌ ను కూడా విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ తోనే ఈ సినిమాను పింక్‌ తరహాలో కాకుండా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో తెరకెక్కిస్తున్నట్లుగా క్లారిటీ ఇవ్వకనే ఇచ్చారు.

పింక్‌ చిత్రంలో హీరో పాత్రకు జోడీ అంటూ ఏం ఉండదు. కాని పవన్‌ తో సినిమా కనుక హీరోయిన్‌ లేకుంటే ఎలా ఉంటుందనుకున్నారో ఏమో కాని ఈ చిత్రంలో పవన్‌ కు జోడీగా హీరోయిన్‌ ను నటింపజేస్తున్నారట. పవన్‌ కు జోడీ కోసం పలువురు హీరోయిన్స్‌ ను సంప్రదించిన తర్వాత చివరకు శృతి హాసన్‌ వద్ద యూనిట్‌ సభ్యుల అన్వేషణ ఆగినట్లుగా చెబుతున్నారు. ఈ చిత్రం కోసం 20 రోజుల డేట్లను శృతి హాసన్‌ ఇచ్చిందని సమాచారం అందుతోంది.

వకీల్‌ సాబ్‌ చిత్రం షూటింగ్‌ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేశారు. షూటింగ్‌ ఆగిపోయినా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్‌ 26వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే గతంలో పవన్‌ తో కలిసి గబ్బర్‌ సింగ్‌ లో నటించి మెప్పించిన శృతి హాసన్‌ ను ఈ చిత్రంకు హీరోయిన్‌ గా ఎంపిక చేశారు. వీరిద్దరి కాంబోలో కాటమరాయుడు చిత్రం కూడా వచ్చింది. ఆ సినిమా నిరాశపర్చింది. మూడవ సారి జత కట్టబోతున్న వీరి కాంబో ఈసారి ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News