సల్మాన్ పై విరుచుకుపడ్డ పోసాని!
తాను ఏది చెప్పాలనుకుంటే అది డొంకతిరుగుడు లేకుండా, అనుకున్నది అనుకున్నట్లుగా, ముక్కుసూటిగా చెప్పే వ్యక్తుల్లో పోసాని కృష్ణమురళి ఒకరు! విషయం ఏదైనా తాను స్పందించే విధానం కచ్చితంగా విషయం దాగున్నదై ఉంటుందనడంలో సందేహం లేదు. అతితక్కువ సమయంలో వంద కథలు రాసిన ఈ సీనియర్ రైటర్ కం డైరెక్టర్ కం రైటర్ తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ మీద తనదైన స్టైల్లో కామెంట్స్ చేసారు. తాజాగా ఒక ఇంటర్వులో పాల్గొన్న పోసాని.. సల్మాన్ ను మించిన తీవ్రవాది ఈ దేశంలో ఎవరూ లేరంటూ విరుచుకుపడ్డారు.
భారత్ - పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న పాకిస్థాన్ నటులను రెండురోజుల్లో దేశం విడిచి వెళ్ళాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి అవకాశాలిచ్చే సినిమాల షూటింగులు కూడా జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ అల్టిమేటంపై బాలీవుడ్ జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ క్రమంలో స్పందించిన సల్మాన్ ఖాన్... యూరీ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులే, కానీ కళాకారులు కాదని, పాక్ ఆర్టిస్టులు ఉగ్రవాదులు కాదని, భారత ప్రభుత్వ అనుమతితో వర్క్ పర్మిట్ లతోనే భారత్ వచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో సల్మాన్ వ్యాఖ్యలపై ఎవరికి తోచిన స్థాయిలో వారు ఫైరయ్యారు.
ఇదే విషయంలో సల్మాన్ కామెంట్స్ పై స్పందించిన పోసాని... "అసలు ఈ దేశంలో సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజంగా సల్మాన్ అంత ఉత్తమ పురుషుడే అయితే.. ఆరోజు తన కారు యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/