• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్‌లో 'పోర్షే' కార్...

టాలీవుడ్‌లో 'పోర్షే' కార్ కొనుగోలు చేసిన టాప్- 5 స్టార్స్

| గ్యారేజీలో ఎన్ని విదేశీ బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నా జర్మన్ లగ్జరీ కార్ మేకర్ `పోర్షే` అందించే స్పీడ్, క్లాస్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మన సెలబ్రిటీలు ఫిదా అయిపోతుంటారు.

By - Sivaji Kontham
Update: 2026-06-21 12:02 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలకు లగ్జరీ బ్రాండ్ స్పోర్ట్స్ కార్లంటే విపరీతమైన క్రేజ్. గ్యారేజీలో ఎన్ని విదేశీ బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నా జర్మన్ లగ్జరీ కార్ మేకర్ `పోర్షే` అందించే స్పీడ్, క్లాస్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు మన సెలబ్రిటీలు ఫిదా అయిపోతుంటారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ అల్ట్రా లగ్జరీ స్పోర్ట్స్ కార్లను సొంతం చేసుకున్న టాలీవుడ్ టాప్ 5 స్టార్స్ వివరాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. హైద‌రాబాద్ కేబుల్ బ్రిడ్జిపై పోర్షే కొత్త కార్ లో శోభిత‌తో క‌లిసి ర‌య్ మంటూ దూసుకుపోతున్న నాగ‌చైత‌న్య‌ను చూసాక‌.. ఫ్యాన్స్ లో ఈ పోర్షే గురించిన చ‌ర్చ మొద‌లైంది. పోర్షే బ్రాండ్ లో అత్యంత ఖ‌రీదైన అల్ట్రా మోడ్ర‌న్ కార్ ని కొనుగోలు చేసి చై అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు.

రామ్ చరణ్ - పోర్షే కేయాన్ ట‌ర్బో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కార్ల కలెక్షన్‌లోనూ పోర్షే కారుకు ప్రత్యేక స్థానం ఉంది. చరణ్ గ్యారేజీలో `పోర్షే కేయాన్ ట‌ర్బో` వేరియంట్ కారు ఉంది. దీని విలువ దాదాపు రూ.2.00 కోట్లకు పైమాటే. ఎంతో పవర్‌ఫుల్ వి8 ఇంజిన్‌తో నడిచే ఈ ప్రీమియం స్పోర్ట్స్ ఎస్‌యూవీని రామ్ చరణ్ గతంలో ఎన్నో సందర్భాలలో స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించారు. లగ్జరీతో పాటు స్పీడ్‌ను ఇష్టపడే వారికి ఈ మోడల్ కేరాఫ్ అడ్రస్.

ఎన్టీఆర్ - పోర్షే కేయాన్ నోవా

యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ కార్ల కలెక్షన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అత‌డి గ్యారేజీలో దేశంలోనే మొట్టమొదటి లాంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారుతో పాటు `పోర్షే కేయాన్ నోవా` లగ్జరీ ఎస్‌యూవీ కూడా ఉంది. దీని ధర సుమారు రూ.1.50 కోట్ల నుండి రూ.2.00 కోట్ల వరకు ఉంటుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, లగ్జరీ ఇంటీరియర్స్‌తో ఉండే ఈ కారును ఎన్టీఆర్ తన పర్సనల్ రైడ్స్ కోసం రెగ్యుల‌ర్ గా ఉపయోగిస్తుంటారు.

అల్లు అర్జున్- రవితేజ - పోర్షే కేయాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ కూడా పోర్షే బ్రాండ్‌కు పెద్ద అభిమానులు. వీరిద్దరి వద్ద పోర్షే కేయాన్ లగ్జరీ ఎస్‌యూవీలు ఉన్నాయి. అల్లు అర్జున్ తన `ఫాల్కన్` కారవాన్ , రేంజ్ రోవర్‌తో పాటు ఈ కారును కూడా మెయింటైన్ చేస్తుండగా... రవితేజ సైతం తన లగ్జరీ ప్రయాణాల కోసం పోర్షే కేయెన్ కారునే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఈ మోడల్స్ మార్కెట్ వాల్యూ వేరియంట్‌ను బట్టి రూ.1.50 కోట్లకు పైగా ఉంటుంది.

అక్కినేని నాగచైతన్య - పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్

టాలీవుడ్‌లో కార్లు, బైకులంటే అమితంగా ఇష్టపడే యంగ్ హీరోగా నాగచైతన్యకు గుర్తింపు ఉంది. అత‌డి గ్యారేజీలోకి వచ్చిన లేటెస్ట్ క్రేజీ సూపర్ కార్ `పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్`. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.50 కోట్లు. టాక్సులు, కస్టమైజేషన్‌తో కలిపి మరింత ఎక్కువే ఉంటుంది. ఈ ట్రాక్ రేసింగ్ కారును జీటీ మెటాలిక్ సిల్వర్ షేడ్‌లో చైతన్య ఆర్డర్ ఇచ్చి మరీ కొనుగోలు చేశారు. రీసెంట్‌గా ఈ స్పెష‌ల్ ల‌గ్జ‌రీ కార్‌లో నాగచైతన్య-శోభితా ధూళిపాళ దంప‌తులు కలిసి సిటీలో షికారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేబుల్ బ్రిడ్జ్ పై ర‌య్ మంటూ దూసుకుపోతోంది ఈ జంట‌.

సీనియర్ నటుడు నరేష్ -పోర్షే ప‌న‌మెరా జీ3 ట‌ర్బో

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఇటీవల సరికొత్త సరికొత్త `పోర్షే ప‌న‌మెరా జీ3 ట‌ర్బో` కారును కొనుగోలు చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. బ్లూ కలర్‌లో మెరిసిపోతున్న ఈ లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ విలువ దాదాపు రూ.2.70 కోట్లు. టాలీవుడ్‌లో ఈ సరికొత్త జనరేషన్ పనామెరా టర్బో కారును సొంతం చేసుకున్న మొదటి నటుడిగా నరేష్ రికార్డు సృష్టించారు.

Tags:    
  • nagachaitanya 
  • ramcharan 
  • porsche 
  • tollywood 
  • luxurycars 
  • porsche911gt3rs 
  • shobhitadhulipala 
  • supercars 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS