కౌంట్‌డౌన్ స్టార్ట్.. ‘టాక్సిక్’ రిలీజ్ డేట్‌తో యశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

రాఖీ భాయ్ యశ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్ రానే వచ్చింది.

Update: 2026-06-21 10:00 GMT

రాఖీ భాయ్ యశ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్‌డేట్ రానే వచ్చింది. తన 'టాక్సిక్' సినిమా గురించి శనివారం (జూన్ 20) ఒక క్రేజీ అనౌన్స్మెంట్ ఇస్తానని చెప్పిన యశ్.. అన్నట్లుగానే తన అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పారు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా అఫీషియల్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో 'టాక్సిక్' హంగామా మళ్లీ మొదలైంది.



 


ఎట్టకేలకు లాక్ అయిన కొత్త రిలీజ్ డేట్:

వివిధ కారణాల వల్ల ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘టాక్సిక్’ సినిమాకు ఎట్టకేలకు ఒక పక్కా డేట్ కుదిరింది. ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు రాఖీ భాయ్ యశ్ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ క్రేజీ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఇన్నాళ్లుగా ఉన్న సస్పెన్స్‌కు తెరపడటమే కాకుండా, థియేటర్లలో రచ్చ చేయడానికి కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది.

వాయిదాల వెనుక పెద్ద రీజన్లే ఉన్నాయి:

నిజానికి అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ పాటికే ‘టాక్సిక్’ థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ మొదటిసారి యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగి వాయిదా పడింది. ఇక రెండోసారి సినిమా మార్కెట్‌ను వరల్డ్ వైడ్‌గా భారీ రేంజ్‌లో విస్తరించడం కోసం మేకర్స్ కావలనే రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ రాత్రింబవళ్లు వర్క్ చేస్తున్నారు.

ఐదుగురు స్టార్ హీరోయిన్ల దండయాత్ర:

‘KGF: చాప్టర్ 2’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యశ్ ఒప్పుకున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ వందల కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా లెవెల్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి ఐదుగురు టాప్ స్టార్ హీరోయిన్స్ నటిస్తుండటం విశేషం.

మహిళా దర్శకురాలి ‘ఊర మాస్’ మ్యాజిక్:

ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మహిళా డైరెక్టర్ అయ్యుండి కూడా యశ్ లాంటి మాస్ హీరోతో ఇలాంటి ఒక ఇంటెన్స్ ‘ఊర మాస్’ యాక్షన్ చిత్రాన్ని హ్యాండిల్ చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కథా రచనలో యశ్ కూడా స్వయంగా భాగస్వామి అయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు సోషల్ మీడియాను షేక్ చేసి, విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.

ఆగస్టు 26న రాబోతున్న ‘టాక్సిక్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి యశ్ గట్టి ప్లానే వేశారు. ఇప్పటికే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్న రాఖీ భాయ్.. మరి ఈసారి థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత కోస్తారో చూడాలి.

Tags:    

Similar News