లేట్ అయినా.. ఆడియన్స్ టేస్ట్‌ కు తగ్గట్టు ఉంటుందా?

ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్‌పై అంచనాలు పెరగడం సహజం. కానీ ఆ సీక్వెల్ రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే పరిస్థితులు మారిపోతాయి.

Update: 2026-06-21 10:57 GMT

ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్‌పై అంచనాలు పెరగడం సహజం. కానీ ఆ సీక్వెల్ రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే పరిస్థితులు మారిపోతాయి. ప్రేక్షకుల అభిరుచులు మారుతాయి. కొత్త కథలు, కొత్త జానర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ 2 విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. షూటింగ్ పూర్తయినా సినిమా ఇంకా విడుదల కాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు కొన్ని డౌట్లు కూడా వినిపిస్తున్నాయి.

2022లో విడుదలైన సర్దార్ కార్తీ కెరీర్‌ లో స్పెషల్ హిట్ గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో కార్తీ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ కలిసిన కథ ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మంచి వసూళ్లు సాధించి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ఆ విజయంతోనే సర్దార్ 2ను ప్రకటించారు. అప్పటి నుంచే సీక్వెల్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. మూవీ యూనిట్ కేక్ కట్ చేసి షూటింగ్ ముగిసిన సందర్భంగా సంబరాలు జరుపుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కార్తీ కూడా ఇది భారీ యాక్షన్ అడ్వెంచర్‌ గా ఉండబోతుందని పేర్కొన్నారు.

సినిమాలో కార్తీతో పాటు అషికా రంగనాథ్, మాళవిక మోహనన్, రాజీషా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌.జే. సూర్య మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిర్మాత లక్ష్మణన్ కూడా ఫస్ట్ పార్ట్ కు మించి సీక్వెల్ ఉంటుందని, ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎలాంటి రాజీ పడలేదని చెబుతున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఎలిమెంట్స్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే విడుదల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పొంగల్ సీజన్‌ ను లక్ష్యంగా పెట్టుకుని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. సర్దార్ విడుదలై అప్పటికే నాలుగేళ్లకు చేరువవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. కేవలం యాక్షన్ లేదా స్టార్ ఇమేజ్ మాత్రమే కాకుండా కథలో కొత్తదనం, వేగం, స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా సీక్వెల్‌ ల విషయంలో మొదటి భాగం కంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

మరోవైపు సర్దార్ హిట్ కావడం కూడా సర్దార్ 2కు సవాలుగా మారింది. మొదటి భాగం సృష్టించిన అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదు. కథ, స్క్రీన్‌ ప్లే, యాక్షన్ సన్నివేశాలు అన్నీ కొత్త స్థాయిలో ఉండాల్సిందే. లేదంటే ప్రేక్షకులు నిరాశ చెందే అవకాశం ఉంది. అయితే కార్తీకి ఉన్న మార్కెట్, పీఎస్ మిత్రన్ ట్రాక్ రికార్డు, భారీ స్థాయిలో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ సినిమాకు స్ట్రాంగ్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు సర్దార్ 2 ఆలస్యంగా వస్తున్నా.. నేటి ఆడియన్స్ టేస్ట్‌ కు తగ్గట్టు ఉండి మరోసారి బాక్సాఫీస్‌ షేక్ చేస్తుందా? లేక అంచనాల భారం సినిమాపై ఎఫెక్ట్ చూపుతుందా? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News